మన శ్మశానం చరిత్ర.....

మన శ్మశానం చరిత్ర.

1.         వరదా రామారావు గారు ఆలోచన

            వెనిగళ్ళ వసంతరావు ఆలోచన

2.         పైడిపాముల కృష్ణకుమారి గారు

            డా. పద్మావతి గారు

3.         స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు సేవ ఎంతని చెప్పను తమ కోసం కాకుండా ప్రతి రోజూ 2 గంటల పాటు శారీరక శ్రమ చేసి చెమటను చిందిస్తున్నారు.

4.         గుంటూరు పెద్దల సహకారం కార్యకర్తలను stage పైకి పిలిచి గౌరవించడం.

5. ధన సహాయం

            డా. పద్మావతి గారు

            డా. వరప్రసాదరెడ్డి గారు – 6 లక్షలు

            డా. గురవారెడ్డి గారు

            సజ్జా ప్రసాదు గారు లక్ష

            అంజియ్య గారు లక్ష

            శివబాబు గారు లక్ష

            డా. శివప్రసాదు గారు – 6 + 2 + 4 లక్షలు

            కనికిశెట్టి చంద్రశేఖర్ ఫాను

            కాశీభట్ల రఘునాధసాయి మోటరు

            శివయ్య గారి బృందం టాంకు, షవర్లు

            డా. కాలేషావలి గారు (ఎముకల డాక్టరు , విజయవాడ) – 50,000/-            

6.         Material - మెరకకు – MRO స్వర్ణ మేరి గారు, VRO తూము వెంకటేశ్వరరావు గారు - Execute చేసింది అడపా రాంబాబు.

7.         కేటాయింపు - Infrastructure కోసం official గా కావలి కదా.  

ఎన్నో ప్రయత్నాల తర్వాత అప్పటి పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. కలెక్టర్ లక్ష్మీకాంత్ గారు, RDO సాయిబాబు గారు పంచాయితీ కి శ్మశానానికి, డంపింగ్ యార్డుకి స్తలాన్నీ కేటాయించారు.

చక్కగా design చేసింది MRO భిక్షారావు గారు.

8. అధికారులు : డ్రైనేజి మట్టి అనుమతి బుద్ధప్రసాదు గారి ద్వారా – Drainage వారు అప్పటి MDO విద్యాసాగర్ గారు గైడెన్సు ఎంతో ఉపయోగపడింది. అందరు అధికారులూ సానుకూలంగా స్పందించారు. పంచాయితీ సెక్రటరీ బొల్లినేని ప్రసాదు గారి సహకారం మరువలేము.

9. ప్రజా ప్రతినిధులు అప్పటి పాలక వర్గం సర్పంచ్ పద్మావతి గారు, ఉపసర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్ (నాని) గారు, వార్డు సభ్యులు ఊరి పెద్దలు అనేక విధాలుగా సహకరించారు.

10.       డా. శివప్రసాదు గారు అద్భుతమైన దహనవాటికను, ఎదురుగా వేచి ఉండే స్ధలాన్ని కట్టించారు దాదాపు 10 లక్షలు ఖర్చు అయింది. వారు 6 లక్షలు వారి కుమార్తె 2 లక్షలు ఇచ్చారు.

11.       మా నాన్న గారు, అమ్మ గారు, అబ్బాయి వరుణ్, కోడలు దివ్య, కూతురు స్నేహ, అల్లుడు కుమార్ కలిసి మంచి టాయిలెట్ కాంప్లెక్స్ కట్టించారు.

12.       సిమెంటు రోడ్డు గత CM చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కొంత భాగం వేశారు. లక్ష్మీ కాంత్ గారిని వదిలి పెట్టకుండా అడుగుతూనే ఉంటే అప్పటికి అయింది.

13.       డంపింగ్ యార్డు మొదలు వరకే అయిన ఈ రోడ్డు డంపింగ్ యార్డు చివరి భాగం సిమెంటు రోడ్డు వేస్తే మన పంచాయితీ ట్రాక్టర్లు వర్షాకాలంలో దిగబడి పోకుండా ఉంటాయి. ఇప్పటి MLA గారైన సింహాద్రి రమేష్ బాబు గారిని అడిగిన వెంటనే sanction చేయించి మనల్నే వేసుకోమన్నారు. వేణు గారు ఏమీ తీసుకోకుండా మంచి రోడ్డు వేయించారు. ఇంకా ఆ డబ్బు రావాలి.

14.       చెత్త నుండీ సంపద కేంద్రం మనకు 15 లక్షలయింది. 9 లక్షల చిల్లర చేతికి వచ్చింది.

15. Maintenance : సూపర్ వైజర్ శ్రీను ఆధ్వర్యంలో 5 గురు ......ఇక్కడ గల 6 సంవత్సరాల నుండీ పనిచేస్తున్నారు.

                        ప్రతి నెలా ఇక్కడ పనిచేసే కార్మికుల జీతాలకు 50 వేలు + సూపర్ వైజర్ శాలరీ + అప్పుడప్పుడు అందరం కలిసి పని చేస్తున్నాం.     

16.       ముఖ ద్వారం దాదాపు 15 లక్షలతో సుందరీకరించాము. ఇది శ్మశానం అంటే నమ్మేట్టు లేకుండా చేశారు డా. పద్మావతి.  

 

ఏం చేయాలి స్వచ్చ చల్లపల్లి కోసం

1.         తడి, పొడి చెత్తలు విడివిడిగా సేకరించే వ్యవస్థను నెలకొల్పాలి.

            పంచాయితీ మాత్రమే చేయగలదు.

            మన సహకారం ఉంటుంది. 

            రోడ్డు మీద చెత్త వేసే వారికి జరిమానా విధించాలి.

2.         డ్రైను పైన, రోడ్డు మార్జిను డ్రైను మధ్య భాగం ఆక్రమణలను తీసివేయాలి.

                        డ్రైనేజి శుభ్రం చేయడానికి, రోడ్డు మీద నీళ్లు పోవడానికి ఇవి అడ్డం.

3.         మన వాళ్లు single plastic ను ban చెయ్యాలి.

                        పంచాయితీకి ఆ అధికారం ఉంటె టీ కప్పులు తీసేసి స్టీలు గాని, గాజు గ్లాసులలోగానీ మాత్రమే టీ ఇవ్వాలనే                         నిబంధన విధించండి.  

                        - హాస్పేట అనుభవం.

                        ముందు మనమందరం క్యారీ బ్యాగులు వాడవద్దు.

4.         ఫ్లెక్సీ లు మనం పెట్టవద్దు.

                        అందరికీ పెట్టద్దని చెప్పాలి.

5. ఎక్కడ నుండో రాత్రికి రాత్రి వచ్చి Advertisement boards బిగించి వెళ్తున్నారు. Roadside gardens కు బోర్డులు బిగుస్తున్నారు. అవి తీసేసి వారికి counseling చేయాలి.    

Posterfree challapalli గా చెయ్యాలని గత పంచాయితీనే నిర్ణయించింది. సుందర చల్లపల్లి కోసం మనం దాన్ని కొనసాగిద్దాం.

 

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

  12.12.2021.