2685* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

శివరాంపురం సమీపంలోనే 2685* నాటి శ్రమ సందేశం!

          ఈ శనివారం (18.2.23) వేకువ - 4.19 నుండి 6. 35 దాక తమ వాగ్దాటితో గాక -  ఆచరణతో వేలాది మందికి సదరు శ్రమదాన సందేశాన్నివ్వ జూసిన స్వచ్ఛ కార్యకర్తలు 30 మంది! వాళ్ల కర్మక్షేత్రం పంట కాల్వ వంతెన కటూ ఇటూగా మరొక 100 గజాల రహదారి ! ప్రోగుబడి, ఊడ్వబడి, ఎత్తి ట్రక్కులో నింపబడి, చెత్తకేంద్రానికి తరలింపబడిన వివిధ రకాల చెత్త ఒక్కదాన్లోనే కుక్కబడిన రెండు ట్రాక్టర్లు!

          2 గంటలకు పైబడిన మంచూ - చలిలో జరిగిన వీధి పారిశుద్ధ్య కృషిని ఇలా పరిమిత పదాలతో మరీ ఇంత పొదుపుగా వ్రాయడం కాస్త కష్టమే! టూకీగా తేల్చేయాలంటే:

- కత్తుల ఒరుపిడులూ, దంతెల గరగరలూ, చెత్తనెత్తుతున్న డిప్పల చప్పుళ్లూ, చీపుళ్ల ఉడుపు శబ్దాలూ స్వచ్ఛ సుందర చల్లపల్లిలో ఏ రోజైనా - ఏదొక మూల వినిపించేవే;

- ప్లాస్టిక్ సంచుల, సీసాల, ప్పు, సారాసీసాల రుడూ నిత్యకృత్యమే;

- సుందరీకరణకు అడ్డు నిలుస్తున్న పిచ్చి - ముళ్లమొక్కల ఖండనమూ, పెద్ద చెట్ల కొమ్మల సుందరీకరణమూ క్రొత్త కాదు;

- కొబ్బరి బొండాల, తాటి టెంకల, ఎండు పుల్లల, రహదారి కాబట్టి పశుల పెంటల ఏరుడూ అలవాటైన పనే!

          ఇక ఈ మహా శివరాత్రి పర్వదిన శ్రమదానకేళిలో వింతేమిటి? క్రొత్తేమిటి? అంటే

1) 30 x 3 వేల మంది - ఈ వేకువ కాలాన ముక్తికోరిన భక్తుల సంఖ్య 3 వేలుంటే - వారు వెళ్లే వచ్చే దారి పరిశుభ్రత కోసం 30 మంది కార్యకర్తలు;

 

2) ఆ చలిలో - మంచులో నిముషానికి 10 వాహనాల కదలికల నడుమ చిన్న పొరపాటూ లేని కార్యకర్తల విజయవంతమైన సామూహిశ్రమ వేడుక!

3) 2 గంటల మురికి - చెమటల పనిముగిసినా మానసికంగా అలసిపోని స్వచ్ఛ కార్యకర్తలు!

4) మిగిలిన పనులట్లా ఉంచి, అసలు రహదారి కాక వంతెన కిరుప్రక్కలా రెండు కాల్వ గట్ల పరిశుభ్రత కోసం 20 మంది కార్యకర్తలెంతగా శ్రమించారో తెలుసా?

          అక్కడి నాలుగైదు కొబ్బరి బొండాల - ఎండుటాకుల - పుల్లల- ప్లాస్టిక్ తుక్కుల మినీ డంపుల్నెత్తడంలో వాళ్ల చురుకూ -డుపూ ఉరుకులూ - పరుగులూ, కొన్ని మార్లైతే  దూరం నుండే చాకచక్యంగా చెత్త డిప్పల్ని విసిరితే అవి గాల్లో ఎగరడమూ పనిలో పనిగా శంకర శాస్త్రి కెమెరా కన్ను ఆదృశ్యాల్ని నిక్షిప్తం చేయడమూ –

          మరి - ఈ సార్థక సామాజిక - సామూహిక శ్రమదాన సన్నివేశాలెంత అరుదైనవి! నేనైతే చివరి 20 నిముషాల పని సందడిని కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాను!

10 నిముషాల సమీక్షా సమయంలో:

- మనకోసం మనం ట్రస్టు కార్మిక ప్రతినిధి కస్తూరి శ్రీను స్లో & స్టడీగా పలికిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ,

- అప్పటి దాక శ్రమించిన ఉద్వేగం, ఉత్సాహం ఇంకా వదలని కార్యకర్తల వికసిత వదనాలూ,

- నేటి శ్రమ వేడుక వర్ణనకు Dr. రామకృష్ణకు చాలని పదాలూ,

- ఇవన్నీ అలా ఉంచి - అందరి ముందూ కాక మనకోసం మనం’ ట్రస్టుకు గుప్తదానంగా వేముల విజయ పద్మావతి గారి కుటుంబం దివంగత శివరామకృష్ణప్రసాద్ గారి సంస్మరణగా ఇచ్చిన విరాళమూ (ఈ కుటుంబం నుండి ఒకాయన క్రమం తప్పని దైనందిన శ్రమ సమయదానాలు కాక -)

 

- చివరిగా పెద్దకదళీపుర విశ్వేశ్వరుని ప్రసాదంగా కమ్మని పులిహోర ఆరగింపులూ....

          మన రేపటి వేకువ శ్రమదాన స్థలం పంట కాల్వ వంతెన నుండి శివరామపుర ప్రవేశం నడుమ!

        ఇదేం ఖర్మ! మన ఊరికి?

ప్రతి ఉదయం సామాజిక బాధ్యతగా ఇంతమంది

ఉమ్మడి సౌకర్యార్థం ఊడ్చి వీధులందగించ -

ఏమాత్రం చలించక ఎలా కొందరుండగలరు!

ఇది అనూహ్య - మిది విచిత్ర - మిదేం ఖర్మ! మన ఊరికి?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  18.02.2023.