29.12.2021....           29-Dec-2021

                      ఒక తీపి పాట

ఔను సుమా! నేనన్నది ఔను నిజం! ఔను నిజం!

చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం తీపి నిజం!

జన జాగృతి పెరగాలని – శ్రమ సంస్కృతి విరియాలని

గ్రామస్తులు స్వచ్చ కార్యకర్తలుగా మారాలని

స్వస్తతకై నిత్యం శ్రమదానం చేస్తుండాలని

దేశాలకు చల్లపల్లి దిక్సూచిగ నిలవాలని

 అది - కష్టంగా కాక భలే ఇష్టంగా జరగాలని

ఈ ఉద్యమ రథసారథి స్వప్నం ఋజువవ్వాలని.....

ఔను సుమా నిజం - నిజం! నేనన్నది నిజం - నిజం!

(శ్రీ శ్రీ మహా ప్రస్థానం లోని చేదుపాట గేయం పట్ల కృతజ్ఞతతో...)