30.12.2021....           30-Dec-2021

 శ్రీశ్రీలాగా చెప్పాలంటే 

ఓ మహాత్మా! ఓ మహర్షీ!

ఏది నష్టం - ఏది కష్టందురదృష్టమదృష్టమేమిటి?

గ్రామమంటే ఇసుక – మట్టాగ్రామమంటే జనం కాదా?

కార్యకర్తల తపస్సెందుకు – ఊరి స్వస్తత కోరి కాదా?

మనం మన కోసం శ్రమిస్తే - గ్రామ సౌఖ్యం మెరుగుపడదా?

హరిత సంపద – స్వచ్ఛ శుభ్రత అందలంలో తిరుగుతుంటే - 

అందమే ఆనందమను కవి అంతరార్ధం బోధపడితే 

కార్యకర్తలె కాకజనమూ కలిసి మెలిసీ శ్రమిస్తుంటే

ఊళ్ళు నందనమైతే దేశం ఉన్నత స్థితి చేరుకొనదా?

          ఓ మహర్షీ! ఏది స్పందనఓ మహాత్మా! ఎచట బాధ్యత?

నీవు నేర్పిన విద్యలేమిటి - నేడు జరిగే తంతులెందుకు?