09.06.2023....           09-Jun-2023

(స్వచ్ఛ కార్యకర్తలు ఎక్కువగా వినే పాటల్లో ఇదొకటి)

శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం ఉందిగా

స్వచ్ఛ సంస్కృతికి ఉదాహరణగా చల్లపల్లి ఒకటుందిగా

శ్రమ సంస్కృతితో - సహకారంతో చల్లపల్లి వెలుగొందగా

వానలోన నడకుదురు రోడ్డులో – స్వచ్ఛ సైనికుల పండగ

                                                  శ్రమైక జీవన

విజ్ఞానంతో వియ్యమందుతూ – వినోదమిచ్చట పండగా 

విహార యాత్రలకు కాశ్మీరాలు – కొడైకెనాలూ ఏలనో    

                                                  శ్రమైక జీవన

సుమసుందర ఉద్యాన పరియమళం – శుభ సందేశం పంపగా

పర్యాటకులకు చల్లపల్లి ఒక స్వర్గధామమై పోయెగా   

                                                  శ్రమైక జీవన