‘సాధనాల సతీష్’ రెండవ కుమార్తె ‘చైత్ర మహిత’ మొదటి పుట్టిన రోజు వేడుక....           26-Mar-2021

 చల్లపల్లిలో మరో హరిత వేడుక


స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త ‘సాధనాల సతీష్’ రెండవ కుమార్తె ‘చైత్ర మహిత’ మొదటి పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఈ రోజు గంగులవారిపాలెం రోడ్డులో జరిగిన వేడుకను హరిత వేడుకగా చేయడం చాలా సంతోషకరం.

ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను ఈ కార్యక్రమంలో వాడలేదు. 

* ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పై ఆహ్వానాన్ని రాశారు. 

* భోజనాల బల్లలపై తగరం కాకుండా కాగితాన్ని పరిచారు. 

* పేపర్ గ్లాసులు, అరటి ఆకులు వాడారు. 

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరి తరపున తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించినందుకు సతీష్ కు అభినందనలు. 

చైత్ర మహితకు పుట్టినరోజు శుభాకాంక్షలు.  

- దాసరి రామకృష్ణ ప్రసాదు
   26.03.2021.