తూము వేంకటేశ్వరరావు – ఇందిరాకుమారి గార్లు కుమార్తె వివాహ పరిచయ వేడుక....           06-Jun-2023

స్వచ్ఛ యార్లగడ్డ కన్వీనర్ తూము వేంకటేశ్వరరావు  ఇందిరాకుమారి గార్లు తమ కుమార్తె వివాహ పరిచయ వేడుకను హరిత వేడుక గా నిర్వహించినందుకు అభినందనలు!

          స్వచ్ఛ - సుందర - చల్లపల్లి కోసం జరుగుతున్న శ్రమదానం వయస్సు నేటికి 2791* రోజులు!

         తూము వేంకటేశ్వరరావు గారు గత 1328* రోజులుగా స్వచ్చ యార్లగడ్డకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యార్లగడ్డ గ్రామంలో కూడా ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులనేమీ వాడకుండా కృషి చేస్తున్నారు.

          ఈరోజు జరిపిన తమ కుమార్తె స్వాతివివాహ పరిచయ వేడుకలో ఫ్లెక్సీ బదులు గుడ్డ బ్యానర్ నే రాయించారు.

          భోజనం బల్లల మీద ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ విస్తర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ స్పూన్లు, కిళ్ళీలపై ప్లాస్టిక్ కవర్లు లేని పర్యావరణహిత  హరిత వేడుకగా నిర్వహించారు!

          ఒక్కనాటి తమ సంతోషం కోసం వందల ఏళ్లు భూమిలో కరగని హానికర ప్లాస్టిక్ లు లేకుండ వేడుక నిర్వహించిన వధూవరులకు, నిర్వాహకులకు - స్వచ్ఛ, సుందర చల్లపల్లి కార్యకర్తల అభినందనలు!

- దాసరి రామకృష్ణ ప్రసాదు 

06.06.2023.