2972 వ రోజు........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

గంగులవారిపాలెం వీధి సేవలో - @2972*

            మాజీ ముఖ్యమంత్రి వారంలో ఒక రోజును పోలవారంఅని పేరు పెట్టి, ఎక్కువ కష్టించేవారట! అలాగే స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల్లో ఒక ముఠా తయారై, ‘రెస్క్యూ టీమ్అనే నిక్ నేమ్ తగిలించుకొని, సోమ, మంగళవారాల్ని తమ సొంతం చేసుకొని, గ్రామ వీధుల మీద పడి, ఎక్కడే ఆపద వచ్చినా, రానున్నా అక్కడ వీరవిహారం చేస్తుంటున్నది!

            మరీ పెద్దవి కాని రోడ్ల గుంటలు, రహదార్ల మీద విరిగిపడ్డ చెట్ల కొమ్మలు, కదలక మొరాయిస్తున్న మురుగు కాల్వలు, కరెంటు తీగల్ని అందుకొన జూస్తున్న చెట్లకొమ్మలు... ఇలా పది మందికీ పనికొచ్చే పనులేవైనా" వాళ్ల సేవలకు కావనర్హం"!

            అప్పుడప్పుడూ బరువు పన్లే కాక సృజనాత్మక సుందరీకరణలక్కూడా పాల్పడుతుంటారు! అలా ఆ 2 రోజులూ తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారన్నమాట!

ఈ 18.12.23 న సైతం 4.22 కే మొదలైన వీధి సౌకర్య కృషి 3 అంచెలుగా

1) పరిశే (వంట) శ్రీను ఇంటి వద్ద చెక్క బెంచీకి నగిషీలు,

2) ఎక్కణ్ణుంచో తెచ్చిన పెద్ద చెట్టు మొద్దును ఆస్పత్రి దగ్గర మర రంపంతో చెక్కి, క్రింద 2 పీటల మీద అమర్చి, మరొక బెంచీగా మార్చడమూ,

3) మాలెంపాటి గోపాలకృష్ణ వైద్యుని వీధి వద్ద ఇంచుమించు ఇలాంటివే కొన్ని పనులుగా 7.30 తరువాతే ముగిసినవి.

ఆస్పత్రి వద్దనే లక్ష్మణ నామధేయ ముదురు కార్యకర్త చెప్పిన స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాల 8 మంది ఛాయాచిత్రాన్ని తిలకించండి!

           

   స్వచ్ఛ కార్యకర్తలనే పేరుందట!

సామాజిక చైతన్యం సాధించుటె ధ్యేయమట

మిడిసి పడే కాలుష్యం మెడలు వంచుతున్నారట

సామాజిక బాధ్యతకై సాహసాలు చేస్తారట

కావుననే స్వచ్ఛ కార్యకర్తలనే పేరుందట!

 

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

 

  18.12.2023