3501* వ రోజు ....

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.

స్వచ్ఛ - సుందర చల్లపల్లి రూపకల్పనలో 3501* వ నాడు

          16.06.2025 వ నాడు 4:17 ని.లకు 216 జాతీయ రహదారిలో కొత్తూరు జంక్షన్ వద్ద ఊరి బాగుదల కోసం కలుసుకున్నది 8+1=9 మంది. ఆ తర్వాత నిదానంగా వచ్చి కలుసుకున్నది మరొక 10 మంది.  

         కార్యకర్తలందరూ ఒక్కొక్కరుగా ట్రస్టు వాహనంలో ముందుగా అమర్చిన గ్లౌస్ ను ధరించి ఎవరి పనిముట్లు వారు తీసుకుని పని రంగంలోకి దిగారు.

         216 జాతీయ రహదారిలోని కొత్తూరు జంక్షన్ వద్ద రోడ్డుకు ఒక వైపు దిగువ భాగాన కొందరు కార్యకర్తలు మొక్కల వద్ద ఉన్న కలుపును ఏరివేసి, పిచ్చి గడ్డిని తొలగించి ప్రోగులుగా పెట్టారు.  

         రోడ్డకు ఎగువ బాగాన ఉన్న కార్యకర్తలు రహదారి వెంబడి పడి ఉన్న చెత్తను, పిచ్చి చెట్లను ప్రోగు చేశారు.   

         5:25 నుండి మరికొంతమంది కార్యకర్తలు చెత్తనంతా ఒక ట్రాక్టర్ లో లోడింగ్ చేసి డంపింగ్ యార్డుకు తరలించడం జరిగింది.    

         6.15 ని.లకి నేను మ్రోగించిన విజిల్ మ్రోతకు పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప మొత్తంగా 19 మంది కార్యకర్తలు సమీక్షలో పాల్గొని ‘మాలెంపాటి ప్రేమానంద మోహన్’ గారు పలికించిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదాలకు బదులిచ్చి,

         రేపటి పనికి కలవవలసిన ప్రదేశం కొత్తూరు జంక్షన్ వద్దనే అని తెలుసుకని నిష్క్రమించారు!

- దాసరి రామకృష్ణ ప్రసాదు

   16.06.2025

 

         ఈ ఉద్యమ సందేశం!

పల్లెటూళ్ల స్వస్తతలకు, ప్రజారోగ్య విస్తృతులకు

పర్యావరణ భద్రతలకు, స్వయం కృషికి, సంతృప్తికి

చల్లపల్లి ఉద్యమమే స్పష్ట ఉదాహరణంఅని

ఏకాదశ వసంతాల ఈ ఉద్యమ సందేశం!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

    16.06.2025.