పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
22.09.2025 సోమవారం 3599* వ రోజు నాటి శ్రమదాన సంగతులు!
హైవే లోని కొత్తూరు జంక్షన్ వద్ద ఉన్న బస్టాప్ దగ్గర కార్యకర్తలు తెల్లవారుజాము
4:19 నిమిషాలకు పనికి సిద్ధమయ్యారు. జాతీయ రహదారికి రెండు ప్రక్కలా నాటిన సువర్ణ గన్నేరు, పారిజాతం, టెకోమా రెడ్ లాంటి పూల మొక్కలు మరియు నీడనిచ్చు మొక్కలలో కలుపు తీసి, పాదు చేయడం లాంటి పనులలో నిమగ్నమయ్యారు.
షుమారు 2 నెలలకు పైగా స్వచ్ఛ కార్యకర్తలు చేస్తున్న శ్రమదానం జాతీయ రహదారి ప్రక్కనే, వారు నాటిన మొక్కలు ఇంకా కొంచెం ఎత్తు పెరిగి పూలతో అలరారుతూ హైవే పై అందంగా చూపరులను ఆకర్షించే విధంగా ఆ మొక్కలను పరిరక్షిస్తున్నారు.
కార్యకర్తలలో ఐదారుగురు నిన్న చేసిన పనికి సంబందించిన చెత్తను ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్నారు. లోడింగ్ ఉండడం వలన రోజూ చేస్తున్న మొక్కలకు కర్రపాతి కంప కట్టే పని ఈరోజు ఆపవలసి వచ్చింది.
గడ్డి కటింగ్ యంత్రానికి మాత్రం చేతి నిండా పని మామూలుగానే ఉంది. వర్షాలకు రోడ్డు మార్జిన్ లలో దట్టంగా పెరిగిన గడ్డిని వరుస క్రమంగా సమాంతరం కట్ చేస్తునారు.
రాత్రి విపరీతంగా వర్షం పడి పని చేయుయుటకు కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ యదా ప్రకారంగా స్వచ్ఛ సేవకు విచ్చేసిన 16 మంది కార్యకర్తలు 6 గంటల వరకూ శ్రమించిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొనారు.
‘విన్నకోట వెంకటేశ్వరరావు’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ “బస్ షెల్డర్” వద్దనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
22.09.2025.
ప్రశ్నల పరంపర – 18
అమెరికాలో బ్రతుకుతూ తన అవసరాలను – అదుపు చేస్తూ
అడుగడుగునా స్వచ్చోద్యమానికి అండదండగ నిలుస్తున్న
సురేశ్ నాదెళ్లనూ అడిగా – “ఎందుకింతటి పిచ్చినీ” కని!
నా జన్మభూమికి సేవ జేసే పిచ్చి మంచిదె” అని జవాబు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
22.09.2025.