3615* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

3615* - 08.10.2025 – బుధవారం - స్వచ్ఛ శ్రమ సంగతులు!

NH 216 లోని కాసానగర్ జంక్షన్ చెక్ పోస్ట్ వద్ద 4:19 నిమిషాలకు13 కార్యకర్తలకు కలుసుకుని మొదటి గ్రూపు ఫోటో దిగి ట్రాక్టర్ లో ఉన్న నచ్చిన పనిముట్లు తీసుకుని శ్రమదానానికి సిద్ధమయ్యారు.

కాసానగర్ జంక్షన్ వద్ద డివైడర్లలో గతంలో పెట్టిన మొక్కలకు ఊపిరాడకుండా ఉండడాన్ని గమనించి ఆ మొక్కల చుట్టూ, చుట్టూ ప్రక్కలంతా శుభ్రం చేశారు.

గడ్డి కోత యంత్రం సహాయంతో ఒక కార్యకర్త ఏపుగా పెరిగిన గడ్డిని సమాంతరంగా కట్ చేయడం, ఆ వెనుక ఒక స్వచ్ఛ మహిళా కార్యకర్త ఊడ్వడం జరుగుతూనే ఉంది.

కొంతమంది కార్యకర్తలు మాత్రం రోజువారీ కార్యక్రమంలో గుట్టలుగా ప్రోగేసిన చెత్త గుట్టలను ట్రాక్టర్ లో లోడ్ చేసుకుని పల్లపు ప్రాంతాల్లో సర్దుతున్నారు.     

4:19 నుండి 6 గం.ల వరకూ విశ్రాంతి లేకుండా చెమట చిందించిన 26 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే  ఈరోజుకి పని నిలుపుదల చేసి,

ఇదే జాతీయ రహదారిలో కాఫీలు త్రాగి,

‘పల్నాటి (డొక్కా) అన్నపూర్ణమ్మ’ గారు పలికిన నినాదాలకు బదులిచ్చి,

               రేపు కలుసుకునేది ఇక్కడే ఈ హైవే లోని కాసానగర్ జంక్షన్ అని తెలుసుకుని ఇంటి బాటపట్టారు.

- ప్రసాద్ వేల్పూరి

    08.10.2025.

అంజలి - స్మృత్యంజలి! – 2

వయసు ఎనభైఏడె గానీ మనసు ఆరేడేళ్ల మాతృక

ఉనికి దావణగెరే ఐనా హృదయమీ సేవోద్యమంబున

అదిగదా ఉత్సాహ వీచిక - అదిగదా బాధ్యత విపంచిక

అతని దొక సౌజన్య సంచిక - అమందానంద ప్రహేళిక!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   08.10.2025