3620* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

13.10.2025 సోమవారం 3620* వ రోజు నాటి స్వచ్చ చల్లపల్లి శ్రమదాన ఘట్టములు!

ఈ రోజు జాతీయ రహదారిపై  కాసానగర్ జంక్షన్ ప్రదేశంలో  సేవను కొనసాగించడానికి వేకువ జాము 4:17 నిమిషాలకల్లా పని చేయు ప్రదేశానికి చేరుకున్నారు. రహదారికి రెండవ వైపున ఉన్న పిచ్చి మొక్కలు కలుపు తీసి శుభ్రం చేసారు.

మరికొద్దిమంది కార్యకర్తలు రహదారి క్రింది భాగంలో ఉన్న నీడ నిచ్చు మొక్కల చుట్టూ, పై భాగంలోని పూల మొక్కలలోనూ క్రింది భాగంలో బాగు చేసి వచ్చిన చెత్తను గుట్టగా పేర్చారు. కొన్ని చెత్తవేయు ఖాళీ ప్రదేశాలలో దారి మార్జిన్ లలో అడవి తంగేడు మొక్కలను నాటి వాటికి కర్రలు పాతడం జరిగింది.

రహదారి మార్జిన్ లో గడ్డిని గడ్డి యంత్రంతో సమానంగా కత్తిరించారు. మహిళా కార్యకర్తలు దారి ప్రక్కన, అలాగే డివైడర్ల ప్రక్కన పేరుకుపోయిన మట్టిని గోకుడు పారలతో గీకి తరువాత ఆ మట్టిని ఎత్తిపోసి ఊడ్చి అద్దంలా తయారుచేశారు.

6 గం.ల వరకూ పని చేసిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప ‘అంబటి శంకర్రావు’ గారు పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,

ఈరోజు సాయంత్రం మండల పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగే కార్యక్రమానికి అందరం స్వచ్చ చల్లపల్లి యూనిఫామ్ తో హాజరావుదాం అని డాక్టరు గారు చెప్పిన సందేశం విని,

రేపు కలవవలసిన ఈ ప్రదేశమే అనుకుని నిష్క్రమించారు.   

- నందేటి శ్రీనివాసరావు

    13.10.2025.

నెలల తరబడీ రహదారి సేవనలు! (NH216 @ Months together!)- 3

పదేళ్లకాలం వెనుకకు చూస్తే - నేటి తీరుతో పోలిక తెస్తే

వందలాదిగా స్వచ్ఛ సైనికుల లక్షల గంటల పని సమయమ్ముల –

తులనాత్మకముగ ఊరి మారుపులు లెక్కలు - డొక్కలు తేల్చి చూపితే –

అప్పుడు తెలియును శ్రమ విలువెంతో - శ్రమదానోద్యమ విశిష్టతేదో!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   13.10.2025