రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత శ్రీ కోడూరి విశ్వవిజయేంద్ర ప్రసాదు గారు గతంలో “స్వచ్ఛ సుందర చల్లపల్లి” శ్రమదాన విశేషాలను తెలుసుకుని చల్లపల్లి అభివృద్ధి కోసం తమ MP విధుల నుండి 50 లక్షల రూపాయలను కేటాయించినందుకు నిన్న (22.02.2026 - ఆదివారం) డా.ఎ.వి.గురవారెడ్డి గారితో సహా ‘స్వచ్ఛ చల్లపల్లి’ రధసారధులు డా.డి.ఆర్.కె.ప్రసాదు, డా.టి.పద్మావతి గార్లు వారిని కలుసుకుని ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ఉద్యమ విశేషాలను పుస్తక రూపంలో అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
విజయేంద్ర ప్రసాదు గారి ఔదార్యంతో కేటాయించిన సదరు 50 లక్షల రూపాయలలో :
1. చిల్లలవాగు గట్టు శ్మశాన, చెత్త కేంద్రాల దక్షిణపు ప్రహారీ నిర్మాణము,
2. హైందవ శ్మశానంలో సిమెంటు రోడ్డు,
పూర్తి కావస్తున్నవి.
3. హిందూ శ్శశానవాటికకు వెళ్ళు వీధిలోని 6 వ నెంబర్ కాల్వ వంతెన నుండి బైపాస్ వీధిని కలుపు రోడ్డులో కొంతభాగం ఇంకా వేయవలసి ఉన్నది.
- నల్లూరి రామారావు
23.02.2026