పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
ఆదివారం (26.4.26) ముగిసిన పాగోలు రోడ్డు సుందరీకరణ కథ @ 3815*
కథ అనగానే అదేదో అందమైన ప్రేమ కథో – RMP శేషు గారు పాడిన ‘అర్థనగ్న తారల అంగాంగ ప్రదర్శనల’ సినిమా కథో అనుకొనేరు !
ఇది గ్రామ వీధుల, చల్లపల్లి చుట్టూ రహదారుల, మురుగు కాల్వల, చెత్త చెదారాలను 12 ఏళ్లుగా స్వచ్చ కార్యకర్తలు విసుగూ విరామం లేకుండ అందంగా మారుస్తున్న ఒక అనాకర్షణీయమైన, రసవత్తరం కాని కథ!
ఈ ఆదివారమైతే - 46 మంది చిన్నా - పెద్దా – వృద్ధ కార్యకర్తలు వేకువ 4.10 కే ప్రారంభించి, 2 గంటలకు పైగా ప్రదర్శించిన శారీరక శ్రమల కథ!
18 రోజులుగా - 700 కుపైగా పని గంటల స్వచ్చ కార్యకర్తలు తమ రహదారిని పరిశుభ్ర- సుందరీకరించినందుకు పాగోలు గ్రామ ప్రజల తరపున యార్లగడ్డ శివ ప్రసాదు గారు అనల్పాహార విందు నిచ్చిన కథ!
ఈ ప్రదర్శనలో తొలుత గుర్తించవలసిన అంకం చందమామ అపార్ట్ మెంట్ల ప్రక్క డ్రైను కష్టమే! 4.10 కి ముందటి, 6.10 కి తదుపరి ఫోటోలను తూము వారు “జై స్వచ్చ చల్లపల్లి సైన్యం”వాట్సప్ లో పెట్టినవి చూడిండి. (కార్యకర్తలు పీల్చిన మురుగు కంపుగాని వాళ్ల బట్టల కంటిన నల్ల మరకలు గాని
6.20 కి పద్మావతమ్మ గారు ఆ ఐదారుగురి శ్రమను వర్ణిస్తుంటే - నాబోటి వాళ్ళకి కూడ “అయ్యో! నేను కూడ ఆ మురుగు పనిలో దిగక పోతినే” అనిపించింది!
కథలో తరువాతి ముఖ్యభాగం నివాసాల ప్రక్క పొలంగట్ల, ఎండు డ్రైను మట్టి పనులు ! అసలా రోడ్డు బారునా చెట్లకు పాదులెంత పొందికగా అమర్చారో - కిలోమీటరు రోడ్డులో మొన్నటి గుంటలు పోయి, శుభ్రపడిన రహదారి ఎంత అదంగా మారిందో ఎవరైనా చూడవచ్చు!
చెత్త బండిని ఎలా లోడింగు చేశారో- బాటనూ, అపార్ట్ మెంటు గేట్ల వద్దా ఎలా ఊడ్చారో అక్కడి గృహస్తులు చూస్తే బాగుండేది!
అంబటి బసవ శంకరుడే నేటి నినాద ప్రవర్తకుడు!
ఈ మధ్యాహ్నం నాయుడు మోహన్ రావు గృహ ప్రవేశ ఆహ్వానాన్ని గుర్తుంచుకొందాం, స్వచ్చ డ్రస్ కోడ్ తో వెళ్తే మంచిదని భావించుదాం!
రేపటి వేకువ మళ్ళీ నాగాయలంక రోడ్డులో వడ్లమర ప్రాంతంలో కలుద్దాం!
అద్దములో చూడాలా?
ప్రజలకు శ్రమదాన గాథ పదేపదే చెప్పాలా?
పరిశుభ్రతె పరమాత్మని పలుమారులు చాటాలా?
ముంజేతుల నగలు కూడా అద్దములో చూడాలా?
స్వస్తపడిన ఊరుండగ సాక్ష్యాలను చూపాలా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
26.04.2026