చల్లపల్లి గ్రామచరిత్రలో ముఖ్యమైన మలుపు - 9 సంవత్సరాల క్రితం ఇదే రోజు....

చల్లపల్లి గ్రామచరిత్రలో ముఖ్యమైన మలుపు

- 9 సంవత్సరాల క్రితం ఇదే రోజు

               స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం మొదలుపెట్టిన రోజున ముందుముందు ఏమేమి మంచి ఫలితాలు రాబోతున్నాయో మనకెవ్వరికీ ఊహల్లో కూడా లేవు.

               ప్రతి బజారులోనూ బహిరంగ మల విసర్జన జరుగుతూ ఉండేది. బహిరంగ మల విసర్జనారహిత (Open Defecation) గ్రామాన్ని సాధించగలమని అప్పుడు ఊహించలేదు.         

               కానీ స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం 900 వ రోజు వేడుక (29.04.2017) లో అప్పటి MDO గారు MLA బుద్ధప్రసాదు గారి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శులకు ODF సర్టిఫికేట్ ను అందజేశారు.

               ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పడాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా 70 వ్యక్తిగత మరుగుదొడ్లను ‘మనకోసం మనం’ ట్రస్ట్ కట్టించింది. మరో 198 మరుగుదొడ్లకు ఆర్ధిక సహాయం చేసింది. బహిరంగ మలవిసర్జనా రహిత గ్రామంగా చల్లపల్లి ప్రకటింపబడటానికి కట్టవలసిన మొత్తం 519 మరుగుదొడ్లకు గాను 268 (51.6%) మరుగుదొడ్ల నిర్మాణానికి ట్రస్ట్ సహాయం చేసింది.

               ఈ మొత్తం కార్యక్రమంలో టాయిలెట్లు కట్టుకోవడానికి ప్రజలను ఒప్పించడంలో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల కృషి శ్లాఘనీయము.

               టాయిలెట్లను కట్టించడంలో MLA బుద్ధప్రసాదు, పంచాయితీ సెక్రటరీ బొల్లినేని ప్రసాద్, డా. పద్మావతి గార్ల కృషి మరువలేనిది.

               9 ఏళ్ల క్రితం జరిగిన ఆ వేడుక ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.

- డా. డి. ఆర్.కె. ప్రసాదు

    29.04.2026