పెద్ద వయసులోనూ - సామాజిక బాధ్యత మరువని రావెళ్ల!
నిజమే- 86 ఏళ్ల వయస్సు ఆయన శరీరానికి. ఆప్రాయంలో కొన్ని రుగ్మతలూ, వినికిడి సమస్యా సహజమే! కాని, రావెళ్ల శివరామకృష్ణయ్య గారు విజయవాడలో తమ కుమార్తె వద్ద ఉంటున్నా స్వచ్ఛ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమాన్ని మరువలేదు. గత రెండేళ్ళుగా దానికి దూరమైనా తన 86 వ జన్మదిన సందర్భంగా అందుకయే ఖర్చుల నిమిత్తం 10,000/- విరాళాన్నీ, స్వచ్ఛ కార్యకర్తలతో తన సహచర్యాన్నీ గుర్తుంచుకొన్నారు.
ఆయన జన్మస్థలమూ, సగం జీవితకాలమూ వామపక్షభావజాల మయమైన మంగళాపురానిది, ద్వితీయ భాగం క్రొత్త శివరామపురానిది. అప్పటి సామాజిక చైతన్యమూ, ప్రజల కోసం పనిచేయాలనే ఉత్సాహమూ ఆయనలో నేటికీ చెక్కు చెదరలేదు.
వారికి మా స్వచ్ఛ కార్యకర్తల జన్మదిన అభినందనలు.
- స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు.
24-6-2026.