పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం
బుధవారం (8-7-26) నాటి ATM సెంటర్ సేవలు!@ 3887*
రావడానికైతే కార్యకర్తలు 29 మంది వచ్చారు గానీ – వీధి సేవలు మాత్రం 150 గజాలకే పరిమితమైనవి. అందులోనూ 100 గజాల దాకా –
A. 2 దేవాలయాల
B. 2 బ్యాంకుల
C. వివిధ దుకాణాల ప్రాంతానికే పరిమితమైన కారణములేమనగా –
1. క్రిక్కిసిరిన దుకాణాలు
2. పర్యావరణ స్పృహ లోపించిన ప్రజలు
3. ఉమ్మడి ప్రజారోగ్యమే పట్టని కొనుగోలుదారులు, అమ్మకం దారులు
4. దైవ చింతన మాత్రమే పెరిగి, సాటి సజీవ మానవుల స్వస్తత పట్ల శ్రద్ద తరిగిన భక్త మహశయులు
5. గుడులు మీద ఆధారపడిన టెంకాయల, పూల, పూజా ద్రవ్యాల అంగళ్ళ వద్ద పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ సంచులు, చిత్తు కాగితాలు
6. కార్యకర్తలు నిన్న బాగుచేసిన వీధి టిఫిన్ సెంటర్ ల, భోజన హోటళ్ళ నుండి గంట గంటకు రోడ్ మీదకు చేరుతున ప్రమాదకర ప్లాస్టిక్ వ్యర్ధాలు
7. పండగలని, పబ్బాలని శుభ- అశుభ సందర్భాలని భాధ్యత కల వారు సైతం పెడుతున్న ఫ్లెక్సీలు
8. స్వచ్ఛ కార్యక్రమాన్ని మనసారా మెచ్చే వాళ్ళు కూడా తెలుసో – తెలియకో సదరు కార్యక్రమానికి నప్పనివి చేస్తుండడం
అసలు ఈ తక్కిన విషయాలు అట్లుండగా ఈ పూట ఈ బందరు వీధి కాస్త బాగంలోనే ఎడతెగకుండా చీపుర్లతో కార్యకర్తలు ఊడ్చిన, ఎత్తిన వందల కొద్దీ డిప్పల ఇసుక - దుమ్ము ట్రాక్టర్ లో నిండిన వైనం చూడండి.
మొత్తానికి 40 పైగా పని గంటల కష్టం ఫలితంగా గ్రామంలోకెల్లా ముఖ్యమైన ఈ సెంటర్ ఇప్పుడు స్వచ్ఛ సుందర చల్లపల్లి వీధి అనదగినట్లు ఉన్నదా లేదా?
ఇకపోతే రేపటి శ్రమదానం కోసం వేకువ సమయంలో మనం ATM సెంటర్ ల వద్దే కలవవలసి వున్నది.
తన కాసానగరు కాదు
తన కాసానగరు కాదు - చల్లపల్లి పరిధి అది
తన చెక్ పోస్ట్ స్థలము కాదు - పొరుగు గ్రామ ప్రాంతం అది
మరి ఎందుకు దాసు గారు మురుగు పనికి పూనుకొనుట?
సామాజిక బాధ్యతకొక చక్కని నిర్వచనము చెప్పుట?
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
08.07.2026