స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలకు వినమ్రపూర్వకమైన మనవి. ....           05-Apr-2020

మన ఊరి ప్రజలందరి ఆరోగ్యం కోసం 1972 రోజుల నుండి ఊహించని రీతిలో గ్రామ పారిశుధ్య నిర్వహణ, సుందరీకరణ పనులను ఎంతో ఓర్పుతో నిర్వహిస్తున్న స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలందరకూ వేనవేలదండాలు. 

నిన్నటి స్వచ్చ కార్యక్రమానంతరం జరిగిన సమావేశంలో కార్యకర్తలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు :  

1. ఈ లాక్ డౌన్ ముగిసే వరకు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం స్వచ్చ కార్యకర్తలెవరూ ఊరు దాటవద్దు. 

2. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం వెళ్లవద్దు. 

3. తప్పనిసరి పరిస్ధితులలో విజయవాడ, మచిలీపట్నం వెళ్ళవలసి వస్తే స్వీయ నియంత్రణను విధించుకుంటూ లాక్ డౌన్ పిరియడ్ పూర్తయ్యే వరకు స్వచ్చ కార్యక్రమానికి హాజరు కారాదు. 

4. లాక్ డౌన్ పిరియడ్ పూర్తయ్యే వరకు కాఫీలు కూడా వద్దని - నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 

గ్లౌస్, హెడ్ లైట్లు కొత్తవి కొనడానికి గాని, రిపేర్ చేయించడానికి అవకాశం లేని పరిస్ధితి ఇది. 

కార్యకర్తలందరూ ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్ధం చేసుకొని సహకరించగలరని మనవి. 

అందరం కలిసి 'కరోనా' వైరస్ ను మన ఊరి పొలిమేర దాటి లోనికి రాకుండా చేద్దాం. 

దాసరి రామకృష్ణ ప్రసాదు
చల్లపల్లి
05.04.2020