ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారానికి ఫ్లెక్సీలు వాడవద్దు. “ఫ్లెక్సీ షేమ్” ఉద్యమాన్ని బలపరచండి. ....           30-Sep-2025

 ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారానికి ఫ్లెక్సీలు వాడవద్దు.

ఫ్లెక్సీ షేమ్ఉద్యమాన్ని బలపరచండి. 

ఈ మధ్య కాలంలో అనేక గ్రామాలలోనూ, పట్టణాలలోనూ ప్లాస్టిక్ వాడవద్దనే ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ అనేక ప్లాస్టిక్ వ్యతిరేక ప్రదర్శనలు చూస్తున్నాము.

               ఇటువంటి ప్రదర్శనలలో కొన్నిసార్లు ప్లాస్టిక్ వ్యతిరేక నినాదాలను ఫ్లెక్సీ పై రాయించి ఆ ఫ్లెక్సీ లతో ఊరేగింపులు జరుపుతున్నారు.

ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు (క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ మంచినీటి సీసాలు, ప్లాస్టిక్ విస్తరాకులు, స్ట్రాలు, ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్క్ లు, ప్లాస్టిక్ పన్ను పుల్లలు వగైరాలు) వాడటం మానివేస్తే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ లో 50 శాతాన్ని నివారించవచ్చు.

               ఫ్లెక్సీ లు కూడా ప్లాస్టిక్కే! మరింత ప్రమాదం కూడా. కొన్ని వందల సంవత్సరాల వరకూ భూమిలో కరగవు. కనుక సమాజహితం కోరేవారందరికీ ఒక్క ఫ్లెక్సీ కూడా వాడవద్దని మా విజ్ఞప్తి. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం చేసేవాళ్ళు గుడ్డ బ్యానర్ ను మాత్రమే వాడిఫ్లెక్సీ షేమ్ఉద్యమానికి మద్దతునివ్వవలసిందిగా విజ్ఞప్తి. 

ఇట్లు

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

డా. పద్మావతి

స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలందరి తరపున

30.09.2025.