చాగంటి కోటేశ్వరరావు గారికి విజ్ఞప్తి....           18-Nov-2025

                నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారులైన ప్రముఖ ప్రవచనాకారులు గౌ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని హైదరాబాద్ లో డా. వరప్రసాదరెడ్డి గారి ఇంటి వద్ద కలిశాము. డా. గురవారెడ్డి గారు మమ్మల్ని ఇద్దరినీ పరిచయం చేస్తూ చల్లపల్లిలో జరిగే కార్యక్రమాన్ని వివరించి చల్లపల్లిని ఒకసారి సందర్శించవలసిందిగా కోరారు.

               క్యారీ బ్యాగుల వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులతో కొన్ని ప్రార్ధనా మందిరములు (దేవాలయాలు) అశుభ్రంగా తయారవటాన్ని వివరించాము. కొన్ని మత సంబంధమైన వేడుకలలో DJ ల వాడుక ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉంటుందని కూడా చెప్పాము.   

               “దేవాలయాల పరిశుభ్రతను, పవిత్రతను కాపాడడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను గుడులలోనికి తీసుకురావద్దని,  DJ ల వాడకం వద్దని తమ ప్రవచనములలో భక్తులకు విజ్ఞప్తి చేయవలసిందిగా” అభ్యర్ధించాము.

               “ఇది ఎంతో మంచి పని, తప్పకుండా చేయగలను” అని వారు సానుకూలంగా స్పందించారు. ఎంతో సంతోషంతో నమస్కరించి వచ్చాము.      

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

    డా. తరిగోపుల పద్మావతి

    18.11.2025