10.11.2023....           10-Nov-2023

 ఈ సుందర స్వచ్ఛ – ఉద్యమం...

ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ఒనగూర్చిన ఫలితాలెన్నో

సామూహిక శ్రమదానంతో సమకూడిన మేలదేమిటో... ఒక

ఉన్న ఊరి స్వస్తత కోసం – కార్యకర్తల తపస్సు లెన్నో

మన సుందర స్వచ్చ ఉద్యమం – ఒన గూర్చిన ఫలితాలెన్నో 

ప్రతి వేకువ గ్రామ వీధిలో - పారిశుద్ధ్య ప్రయత్నమెంతో

ఎండల - వానల - మంచు - తుఫానుల నెదిరించిన ఘట్టాలెన్నో

శ్మశానమున - చెత్త కేంద్రమున - సాగించిన సమరములెన్నో...

 మన సుందర స్వచ్చ ఉద్యమం – ఒన గూర్చిన ఫలితాలెన్నో

సామూహిక శ్రమదానంతో – సమకూడిన మేలదేమిటో 

స్వచ్చోద్యమ నేపథ్యంలో – జరిగిన మేధోమధనమ్ములు

రెండొ - మూడొ లక్షల గంటల – శ్రమ జీవన సన్నివేశములు

మురుగు కాల్వలురహదారులలో - మొగ్గ తొడిగిన హరిత సంపదలు

పొరుగూళ్లకు – రాష్ట్రవ్యాప్తముగ - పోటెత్తిన స్ఫూర్తి మంత్రములు

ఈ సుందర స్వచ్ఛ ఉద్యమం- సాధించిన ఫలితాలెన్నో 

గ్రామాల్లో చెత్తా చెదారం – కనిపించని కాలమెప్పుడో

అడుగడుగున స్వచ్చ – శుభ్రతల – ఆనంద వికాసమెప్పుడో

ప్రతి పౌరుడు ఊరి బాధ్యతలు – పాటించు ముహూర్తమెన్నడో

అందరొక్కడై, ఒక్కడందరై – అడుగిడు శుభ సమయం ఏదో..

ఈ సుందర స్వచ్ఛ ఉద్యమం