ప్రాతూరి విద్యాసాగర్....           17-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -  

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 41

 

స్వచ్ఛ సుందర హరిత చల్లపల్లి సాధింపబడిన తీరు నా మాటలలో :

 

2014 లో:

ఒకరోజు డాక్టర్ డిఆర్కె గారు మండలపరిషత్ ఆఫీస్ కు వచ్చారు. వచ్చేముందు ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడాలన్నారు సరేనండి అనగా వచ్చారు. అప్పటికింకా ఉద్యమరూపం దాల్చలేదు. డిప్యూటీ స్పీకర్ గారికి ఇలా మాటిచ్చాము దీనిని అమలుచేయడములో అందరినీ సంప్రదిస్తున్నాను అన్నారు. నాకు ఈనాటికి గుర్తున్న ప్రశ్నమనము ప్రయత్నిస్తే ప్రజల ఆలోచన, అలవాట్లు, జీవనము, అవగాహన మార్చగలమా ?” తప్పక మార్చగలమండిమారేవరకూ ఆపకుండా సాత్వికంగా ప్రయత్నించాలి అన్నాను. హమ్మయ్య !! నాకు ధైర్యము వచ్చిందండి మీ మాటలతో !! అంతా మీకెందుకు డాక్టరుగారు ఈ చెత్త పనులన్నీ అంటుంటే !!! కొద్దిగా నీరసం వస్తోంది. ఇక పరవాలేదు మనం ప్రణాళిక వేద్దాము అన్నారు. సరేనండి అని చాలా అంశాలపై మాట్లాడుకున్నాము గంటన్నర. నన్ను స్వచ్ఛసుందరహరిత చల్లపల్లి సభ్యులలో అవకాశమిచ్చారు ఆలోచనా సంఘములోఅందుకు వారికి ధన్యవాదాలు .

 

పద్మావతి ఆసుపత్రి రోడ్డు శాశ్వత బహిర్భూమి :

 

చల్లపల్లి - రామానగరము సరిహద్దులో పద్మావతి ఆసుపత్రిరోజుకు 100 మందికి వైద్యంచుట్టూతా దుర్గంధంవైద్యం అద్భుతంవెళ్ళేదారి 60 అడుగుల రోడ్డు - కాని కాలు పెట్టడానికి వీలుకాదుసమాలోచనకదిలింది జనవిజ్ఞాన వేదికఉదయం నాలుగింటికినమస్కారాలు - విజిల్స్ - టార్చ్ లైట్లు - చేతిలో కర్రచల్లపల్లిలో సామజిక ఉద్యమానికి బీజం పడింది. మార్పుకు నాంది పలికింది 2011లోనేఊపందుకుంది 2014లోనేడు ఆ రోడ్డు విశాలమైన 60 అడుగుల రహదారిపచ్చటి చెట్లుపూదోటలురాష్ట్రంలోనే గ్రామీణ ప్రాంతంలో మొదటి భూగర్భ డ్రైనేజి స్వచ్ఛందంగా డిఆర్కె గారి కల సాకారముస్వచ్ఛ చల్లపల్లి కాదుస్వచ్ఛ సుందర చల్లపల్లిగా రాష్ట్రమంతా తెలిసిందిఆనాటి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ గారి సహకారంతో. నాపాత్ర ప్రణాళిక తయారీ - రోడ్డు మంజూరు - అమలు - పర్యవేక్షణ - సలహ - సంప్రదింపు.

 

బాలికల వసతిగృహము ప్రాంతము:

 

చల్లపల్లి లోని సగం జనాభా ఉపయోగించే బహిర్భూమి. ఈ ప్రాంతంలో బహిరంగ మలవిసర్జనను మానటానికి 100 సం।।లు పట్టింది. చల్లపల్లి ఊరు పుట్టినప్పటినుంచీ ఈప్రాంతము అలాగే ఉంది. దరిదాపు 100 రోజులు ఈ ప్రాంతము బాగుచేయడానికి పట్టింది. ఈ ప్రాంతం బాగుపడింది అంటే నమ్మలేని నిజం - 100 సం।।ల చరిత్ర తిరగబడింది. మొక్కవోని ఆత్మవిశ్వాసం లభించింది. స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో తొలివిజయం నమోదైంది. దీనిలో నాపాత్ర వ్యక్తిగతమరుగుదొడ్లు మంజూరు - ప్రజలకు అవగాహన - నిర్మాణం - స్వచ్ఛంద సంస్థల సహకారము - అందరికీ ఒకే నినాదంజై స్వచ్ఛ సుందర చల్లపల్లి “ … నా పాత్ర సుందరీకరణకు డాక్టర్ పద్మావతి గారితో కలిసి ప్రణాళికలు ప్రారంభం.

 

కమలములే స్వచ్ఛ చల్లపల్లికి గుర్తు :

 

నాలుగు సరిహద్దులలో డంపింగ్ యార్డ్ లుపందులుచెత్తమధ్యలో ఊరుఇలా కనపడింది సైకిల్ పై తిరిగే డిఆర్కె గారికిమనము ఏమైనా చేయాలి దీనికి అని సమీక్షా సమావేశములో చర్చ లేవదీశాముకదిలింది స్వచ్ఛ చల్లపల్లి సైన్యముచేయి చేయి కలిపింది - సాగింది చెత్త పై సమరమునవ్వారందరూమళ్ళా వేస్తారందరూ అన్నారుమొదలైంది మేధో మధనముఅందరిలో ఒకటే ఆలోచనమనకృషి వృధా కారాదు …” డాక్టర్ పద్మావతి గారు ముందుకొచ్చారు నేనున్నాను ఎంత ఖర్చైనా పరవాలేదు వెనుకకు తగ్గద్దన్నారుమరల చెత్తవేయకుండా చూడాలన్నారుమరల సమాలోచనముపంచాయితీ వారు నిస్సహాయత వ్యక్తం చేశారురహదారి వనముల ఏర్పాటు చేద్దాంఇంకా ఏదైనా అందరికీ తెలియచెప్పాలనుకున్నాముఅంతే

నాలుగు సరిహద్దులలో కమలాల నిర్మాణం సాకారమై నేటికి ఒక మైలురాయిగా నిలిచిందిఅందరికీ తెలియజేసే ప్రయత్నము సాకారమైంది.

నేను డాక్టరమ్మగారు సమాలోచన జరిపామని తెలియగానే అందరికీ ఒక నూతన ప్రణాళిక రాబోతోందని సూచనఎదురు చూసేవారు ఏం చెప్తారా అనిడిఆర్కె గారితో చర్చప్రభాత సమయాన ప్రకటన

 

SRYSP జూనియర్ కాలేజి సుందరీకరణ :

 

కాలేజి పాతబడి దీనంగా కనపడేదిఅందరికీ బాగుచేస్తే బాగుంటుందనిపించేదికాని ఎవరో రావాలి - ఏదో చేయాలనే మానవ బలహీనత మారలేదు. స్వచ్ఛ చల్లపల్లి బృందం సమిష్టి విజయం సాధించింది 40 రోజులలోఆహా ! అద్భుతం !! అన్నారందరూఇక తిరుగులేదీ ఉద్యమానికని భావించారు. ఇక ఊరి సమస్యలు పరిష్కారమునకు ఊరివాళ్ళే పూనుకొని మిగిలిన గ్రామాలకు స్ఫూర్తినిచ్చిన సందర్భం.

నా పాత్ర చర్చలు - సంప్రదింపులు - ప్రణాళికలు - అమలు - పర్యవేక్షణ

 

డంపింగ్ యార్డ్ :

 

డాక్టర్ పద్మావతి గారితో ఒకనాడు చర్చ : మనము ఎక్కడో ఒకచోటజై స్వచ్ఛ సుందర చల్లపల్లిఅనే నినాదము శాశ్వతముగా కనబడేటట్లు చేయాలి. దానికి పూలతోట - విశాలమైన ప్రదేశము కావాలిఇలా సాగి డంపింగ్ యార్డ్ ని ఎంపిక చేశాముడిఆర్కె గారికి డంపింగ్ యార్డ్ బాగుచేయాలనే సంకల్పము మాత్రమే ఉందికాని మా ఆలోచనలు వేరు ..

హైవే మీదున్నదానిని, తొంగిచూడటానికే భయపడేదానిని, మురికి కూపం, కిలో మీటరు దూరం నెట్టివేయడముఅందమైన వనమును ఏర్పరచడమువెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు గారు లాంటి వారు చూచి మెచ్చిన సందర్భాలు చల్లపల్లి చరిత్రలో మైలురాళ్ళు.

నా పాత్ర సలహాలు ఇవ్వడం - సమస్యలకు మెరుగైన పరిష్కారము సూచించడము. అక్కడ చెత్తనుండీ  ఎరువు తయారీ కేంద్ర నిర్మాణం చేయడము ప్రతిపాదన

 

గంగులవారిపాలెం కధ :

 

అది చల్లపల్లిలో మారుమూల విసిరేసినట్లుండే చిన్న పల్లె. మాకేమిటి అని ఎదురుచూసే ప్రజలు - సమస్యల తోరణముతో స్వాగతము … 50 ఏళ్ళుగా అదే కధరోడ్డు లేదు , మరుగుదొడ్లు లేవు , స్మశానం లేదు , లైట్లు లేవు, ముంపు ప్రాంతము, వంతెన లేదు , బడికి రావాలంటే దారిలేదు, పిల్లలకు చదువులేదు, పెద్దలకు చదువు రాదుఇలా ఎన్నో సమస్యల తోరణం ‘. వచ్చిందో సామాజిక చైతన్యము - స్వచ్ఛ సుందర చల్లపల్లి సైన్యం - నేడు చూస్తే పై సమస్యలన్నీ మటుమాయంపట్టిన సమయం 4 సం।।లు

నాపాత్ర చర్చ - ప్రణాళిక - మంజూరు - అమలు - పర్యవేక్షణ

 

మేలి మలుపు :

 

చల్లపల్లి ప్రజలకు ప్రశ్న : చెత్త ఎక్కడ వెయ్యాలి ? ఎవరు తీసుకెళతారు ? ఎప్పుడు తీసికెళతారు ? అంతా అయోమయంనూతన చైతన్యం డాక్టర్ గురవారెడ్డి రూపంలో స్వచ్ఛ సుందర చల్లపల్లికి దొరికిన వరంమీకందరికీ నేనున్నా …. ధైర్యంగా ముందడుగేయండిఅనే భరోసా లభించింది. చెత్త తరలింపుకు పరిష్కారం వచ్చింది. ట్రక్ - మనుషులు - డ్రమ్ లు - బుట్టలు - తట్టలు - ఒక వ్యవస్థ ఆవిర్భవించింది … “మనకోసం మనంమొదలైనాయి సమాలోచన - ఏంచేయాలి - ఎలా చేయాలి - ఎవరిస్తారు విరాళం - యాంత్రీకరణ ప్రారంభమైంది స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం మరో మేలి మలుపు తిరిగింది. నాపాత్ర చర్చ - ప్రణాళిక - మంజూరు - అమలు - పర్యవేక్షణ

 

బస్ స్టాండ్ :

 

డాక్టరమ్మగారు - డాక్టరు గారు - నేను వెళ్ళడము పొద్దున 6.00 కు జరిగి ఆలోచించాము 8.30 వరకూడాక్టర్ గారుఇదంతా మనకనవసరము - ఆర్టీసి వారి పని ఇది అని తేల్చేశారు … 5 లక్షలు కావాలి అర్జంటుగా… “ డాక్టరమ్మగారు నేను మిగిలాము … “నేనున్నాను చూసుకుంటాను చేసేద్దాము యండిఓ గారూఅన్నారుమేము మగ్గురమూ కలిసి మాట్లాడేవారముప్రణాళిక వేసేవారముకాని నెలరోజులు డాక్టర్ గారు మా ఇద్దరితో మాట్లాడలేదుకాని మా కష్టానికి కదిలిపోయి చివరకు అద్భుతంగా తయారైన ప్రయాణ ప్రాంగణమే గానగంధర్వ డా. బాలసుబ్రహ్మణ్యం గారిని మెప్పించింది.

 

మరో మలుపు:

 

ఉదయసింగ్ గౌతమ్ గారి సలహాతో రోడ్లు ఊడవడము - మార్జిన్లను బాగుచేయడము - పేవర్ టైల్స్ వేసి వెడల్పు చేయడము - రంగులు వేయడము - ముగ్గులేయడముస్వచ్ఛ సుందర చల్లపల్లి చరిత్రలో సువర్ణాధ్యాయము మొదలైందిప్రతిరోడ్డు బాగు చేయడము,పేవర్ టైల్ వేయడము, ఫెన్సింగ్ వేయడమురహదారి వనము వేయడము , రంగులు వేయడముడబ్బులు మంచినీళ్ళవలె ఖర్చైపోవడముడిఆర్కె గారు ఖంగారు పడడముపద్మావతి గారు ఏమైనా సరే లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పమునా పాత్ర షరా మామూలే

 

హరిత చల్లపల్లి :

 

చల్లపల్లిని చల్లనిపల్లెగా మార్చింది ఈ ప్రయత్నము. రోడ్ మార్జిన్లలో, ప్రభుత్వ ప్రదేశాలలో, సంస్థలలో చెట్లు పెంచడము. పసిపిల్లలను పెంచినట్లు పెంచాలనే వారు విజయా అకాడమీ టీచర్లుప్రధాన రహదారి కిరువైపులా చెట్లు పెంచే బాధ్యత మాది అన్నది విజయా అకాడమీఇక మొదలైంది వనమహోత్సవముమూడంచెల విధానము - పెద్ద చెట్లు - దానిముందు మధ్య గన్నేరు - దానిముందు బిళ్ళ గన్నేరుపూలమొక్కలుఇంటింట చెట్టు - ఊరంతా వనముట్రాక్టర్ - ట్యాంకర్ - కట్టర్ - గ్రేజర్ - వాచ్ మెన్ - ఇలా అన్నీ ఏర్పడినాయి - యల్ ఐ సి వారి ట్రీ గార్డులు - ముళ్ళ కంప గార్డులు - ఊరిలో ఉన్న సర్కారు కంప చెట్లన్నీ ఖాళీఎక్కడ చూసినాఎవరిని అడిగినా మొక్కల పెంపకము గురించి చర్చలే …. నేటికి 20000 మొక్కల పెంపకము.

హరిత చల్లపల్లిగా మారిన స్వచ్ఛసుందర చల్లపల్లి

నాపాత్ర చర్చ - ప్రణాళిక - మంజూరు - అమలు - పర్యవేక్షణ

 

స్ఫూర్తి :

 

గత 18 సం।।ల నుండి ప్రతి వారంలో రెండురోజులు గ్రామాలలో ఉచిత వైద్యం చేస్తున్న ప్రజా వైద్యుడు విజయవాడ నుండి సతీసమేతంగా డా. గోపాలం శివన్నారాయణ గారు ప్రతి బుధవారం చల్లపల్లికి ఉదయం 4గం।।లకు వచ్చేస్తారు. అందరినీ పలకరిస్తారుఅభినందిస్తారుస్ఫూర్తినిస్తారుఅందరూ ఉర్రూతలూగేటట్లు ఉపన్యసిస్తారువారొచ్చి వెళితే ఒక నూతన ఆలోచనఅందరిలో ఒక నూతన చైతన్యం

 

జాతీయ - రాష్ట్ర స్థాయి గుర్తింపు:

 

సువర్ణ గన్నేరుకు  - స్వచ్ఛ సుందర చల్లపల్లి విడదీయరానంత బంధం ఏర్పాటు అయింది. ఒకనాటికి సుద్దాల అశోక్ తేజ గారిని - జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారిని ఆకర్షిస్తుందని ఊహించలేదుకాని వాళ్ళలో సుందరీకరణ బలంగా నాటుకుని జాతీయ వేదికలపై - రాష్ట్ర వేదికలపై చల్లపల్లి జయకేతనము ఎగురవేసింది. దీనిలో కూడా నా పాత్ర తెరవెనుకే.

 

స్వచ్ఛ సుందర హరిత చల్లపల్లి రాష్ట్రపతి భవన్ లో ప్రస్తావించబడిందిఉప రాష్ట్రపతి, ముఖ్య మంత్రి, ఎంతోమంది మంత్రులుమరెందరో విదేశాలనుండి వచ్చి ఉద్యమ స్ఫూర్తిని ఇనుమడింపజేశారు.

 

ఈ సైన్యములో అందరిదీ భాగస్వామ్యంఅందరిదీ ఒకే నినాదంఅందరిదీ శ్రమదాన సంస్కృతికలౌ సంఘే శక్తిః

 

అనామికగ సందేశము హైందవ జీవనసారముసంఘటనం ఒక యజ్ఞంసమిధగ జీవనంభరతమాత పాదాలను తాకుదాంఆమెపాదాలకు మువ్వలమై మ్రోగుదాం

 

జై స్వచ్ఛ సుందర హరిత చల్లపల్లి

- ప్రాతూరి విద్యాసాగర్

  17.06.2020.