నాదెళ్ల సురేష్ గారు....           23-Jun-2020

 మన స్వచ్చ - సుందర మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తే అజ్ఞాత శ్రామికులు

వీళ్ళు సైతం స్వచ్చ కుటుంబీకులే!

 

•  వీళ్ళే మా ట్రస్టు వాహన సారధులు!

 

•  వీళ్ళు వేల రోజులుగా స్వచ్చ కుటుంబ సభ్యుల వస్త్రాలను - శస్త్రాలను - చే తొడుగులను క్రమం తప్పక ఉతికి సిద్ధం చేస్తున్న శ్రామికులు!

 

•  అన్న పాత్రల్ని, కాఫీ పాత్రల్ని కడిగి తళతళ మెరిపించే ఆసుపత్రి ఉద్యోగినులు!

 

•  ఇక వీళ్ళు - ప్రభుత్వం నుండి అతి తక్కువ - చాలీ చాలని పారితోషకంతో నా గ్రామ పారిశుద్ధ్య పరిరక్షకులు!

 

•  తమ దైనందిన శ్రమానంతరం స్వచ్చ సైనికుల సరదా కబుర్ల సమయంలో త్రాగేందుకు కమ్మని కాఫీ కాచి పంపుతున్నది వీళ్ళు!  

 

•  వీళ్లైతే అజ్ఞాతంగా ఉండి, శ్మశానాలను - రహదారి వనాలను వేలాది మొక్కలను సంరక్షిస్తున్న ట్రస్టు ఉద్యోగులు!

 

•  ఇరుగో - వీళ్ళు గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని స్వచ్చోద్యమ ప్రతిదిన విశేషాలను డిజైన్ చేసే – ముద్రించే - ప్రపంచానికందించే నిపుణులు!

           

            మన ప్రియమైన స్వచ్చ సుందర మహల్ నిర్మాణానికి రాళ్లెత్తుతున్న బైటకు కనిపించని ఎందరో ఆదర్శ శ్రామికులు!

 

 - చివరగా నేను పాదాభివందనం చేసి తీరవలసిన వాళ్ళు

 

 తమ భర్తల్నో బిడ్డల్నో అన్న తమ్ముళ్లనో ఊరందరి సౌకర్యం కోసం - శ్మశానాల్ని మురుగ్గుంటల్ని శుభ్రం చేయమని దీవించి  పంపే మహిళామాతల్లులే!

  

    నా వాళ్లైన వీళ్ళందరికీ పదేపదే నా సుమనస్సుమాంజలి!

 

నాదెళ్ల సురేష్, కనెక్టికట్ 

U.S.A