ప్రాతూరి శాస్త్రి 17.08.2020. ....           17-Aug-2020

 " The Eye"

నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో 20 సంవత్సరాలు పాల్గొన్నాను.

 

చాలా తృప్తిగా వుండేది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు గూడా శిక్షణనిచ్చి సేవాకార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేసేవాళ్ళము. సంవత్సరానికి 2 లేక 3 క్యాంపులుండేవి. 

             రిటైరైన జీవితం, భార్యావియోగం, ఖాళీగా ఉండడం మనసును కలత చెందించాయి.

            కొంతకాలం ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాను. కానీ ఫలితం శూన్యం.

             ఆ సమయంలో పెద్దకుమారుడు చల్లపల్లికి రమ్మన్నాడు. సేవాకార్యక్రమం జరుగుతోంది. ప్రతిరోజూ చేస్తున్నారు.

నీకు అన్ని విధాలా బాగుంటుంది అని.

             ఆగష్టు 31 సాయంత్రం చల్లపల్లి వచ్చాను. ఏ క్షణంలో అడుగు పెట్టానో తెలీదు కానీ 5 సం. ల 11 నెలల బంధం కలుగుతుందని తెలీదు.

2015 

       తొలి రోజుల్లో ఏ పని చేయనిచ్చేవారు కాదు. పరిశీలన, డాక్టర్ గారితో వెళ్లడం చూస్తూ ఉండడం.  డా.పద్మావతి గారిని నేను వచ్చిన 10 రోజులకు ఆసుపత్రికి తీసికెళ్లి పరిచయం చేశాడు.   

            బహుశా 7 వ తేదీ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు సందర్శించడం, ఊరిలోని కార్యక్రమం వీడియోలు పెన్ డ్రైవ్ లో తీసుకొని వెళ్లడం, రాష్ట్రపతి భవన్లో చూపడం, వెంకయ్యనాయుడు గారు డాక్టర్ గారితో మాట్లాడడం జరిగాయి. నవంబర్ 15 చల్లపల్లి సందర్శించారు.

            సెప్టెంబర్ నెల చాలా విశిష్టమైనది. డా. యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిని చల్లపల్లికి తీసికొని వస్తున్నానని గురవారెడ్డి గారు అనడం.

            రెండురోజుల ముందు కార్యకర్తల సమావేశం జరిగేది. ఎవరెవరు ఏ పని చేయాలి.

            ఇంతలో డాక్టరమ్మ గారు బస్టాండ్ శుభ్రం చేసి సుందరీకరణ చేద్దాం అన్నారు.

            పెళ్లికి గూడా అంత తయారై వుండదేమోగాని అందరికీ సంబరాలు జరుకుంటున్నట్లు అయింది.

            శ్రీకాకుళం నుండి ప్రతి 3 కి.మీ కు బైకులు. సమాచారాలు ఫోనుల్లో.

            యస్ ఆర్ వై యస్ పి కాలేజీలో సభ దిగ్విజయంగా సాగింది.

            ఆ రోజే మనకోసం మనం ట్రస్ట్ ఆవిర్భావం.

            ఆనాడు వచ్చి గ్రామం చూచిన బాలసుబ్రహ్మణ్యం గారు ఈనాటికీ మనకు వెన్నుదండగా వున్నారు.....

            సెప్టెంబర్ చివరలో డంపింగ్ యార్డు చూడడానికి వెళ్లి దానిని ఎలా శుభ్రం చేయాలి అనే ఆలోచన మొదలైంది.

            కార్యకర్తల శ్రమ వర్ణించనలవి కానిది.

            దుర్గంధభూయిష్టమైన ప్రాంతాన్ని చక్కని ఉద్యానవనంగా మార్చారు.

            నవంబర్ 15న వెంకయ్యనాయుడు గారు హెలికాప్టర్ దిగి డంపింగ్ యార్డుకు వచ్చి ఆనందభరితులై కార్యకర్తలకు లాల్ సలాం చేశారు.

            అప్పటి పంచాయితీ కార్యదర్శి బొల్లినేని ప్రసాదు, యం. పి. పి లంకబాబు గార్లు గూడా సేవలో పాల్గొనేవారు.

- తరువాయి భాగం రేపటి సంచికలో...

 

-ప్రాతూరి శాస్త్రి,  

17.08.2020.