ప్రాతూరి శాస్త్రి 22.08.2020. ....           22-Aug-2020


                                     స్వచ్చ సుందర పల్లె ...... మన చల్లపల్లి

కమ్యూనిస్టు బజారు 250మీ రోడ్డు. Underground drainage చేయదలచి 2 అడుగుల లోతున తవ్వారు. వచ్చిన మట్టిని కార్యకర్తలు ట్రాక్టర్లో లోడు చేసేవారు.

ఈ బజారులో మహిళల సేవ మరపురానిది.

  డా.పద్మావతి గారు తమ మహిళా సైన్యంతో చైను పద్ధతిన ప్రతిరోజూ 3 ట్రాక్టర్ల మట్టి లోడు చేసేవారు

 తీసుకొని వెళ్లిన మట్టిని డంపింగ్ యార్డులో చిల్లలవాగు గట్టుపై రోడ్డు వేశారు. దాదాపు 70 నుండి 80 ట్రాక్టర్ల మట్టిని లోడుచేసి డంపింగ్ యార్డుకు పంపారు.                      

మేము సైతం గ్రామాభ్యుదయానికి తోడ్పడుతాం.

స్వేచ్ఛవుంటే, ప్రేరణ,ధైర్యమిచ్చే వారుంటే మహిళలు చేయలేనిదేమున్నది.

మట్టిమోయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు

 కమ్మునిస్ట్ బజార్ లో  డ్రైన్ కోసం తవ్వగా వచ్చిన మట్టిని డంపింగ్ యార్డుకు తరలించారు.

ఎంత గర్వంగా ఉందో ట్రాక్టర్లో మట్టినింపడానికి

 ఎంత హుషారుగా మహిళలు పనిచేసారో.

ఈ సేవాకార్యక్రమం అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలబడి పోయింది.

ఒకరికొకరు పోటీపడి గంటన్నరలో మూడు ట్రాక్టర్లు రద్దుతో నింపేశారు.

పూల సువాసన గాలి ద్వారా వ్యాపిస్తున్నట్లు అవిశ్రాంత నిస్వార్థ నిరంతర సేవ వ్యాపించకుండా ఉంటుందా?

కాలిన ఇనుముపై  పడిన నీరు ఆవిరై నశించిపోతుంది.

అదే నీటి బిందువు తామరాకుపై పడిన ముత్యంలా ప్రకాశిస్తుంది.

అదే బిందువు ముత్యపు చిప్పలో పడి చక్కని కాంతివంతమైన ముత్యంగా మారుతుంది

కావున ఉత్తములనాశ్రయించిన వారికి వాస్తవ సౌఖ్యము కలుగుతుంది

నిరాడంబరం కన్నా గొప్పది ఏదీలేదు. 

డా.డీఆర్కేప్రసాద్, డా.పద్మావతి గార్ల ఆధ్వర్యంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి మూడు పువ్వులు ఆరు కాయలుగా రూపు దిద్దుకుంటున్నది

 కార్యకర్తలు నిస్వార్థ సేవాకార్యక్రమాలలోని ఆనందం అనుభవిస్తూ శ్రమజీవన సంస్కృతి కి నాంది పలికారు.

చిన్నప్పుడు మానాన్నగారు నేర్పిన శ్లోకం గుర్తుకొస్తుంది.

 ఉత్సాహం, సాహసం, ధైర్యం

 బుద్ధి శక్తి పరాక్రమః

 షడైతే యత్ర తిష్టంతి

 తత్ర దేవోప తిష్ఠతి.

 పైన చెప్పిన ఆరు గుణములు ఎవరియందు మూర్తీభవించి ఉంటాయో వారికి మాత్రమే సంపూర్ణ విజయం లభిస్తుంది.

  ఒక ఉద్యమం సమున్నత లక్ష్యం సాధించాలని ఈ ఆరు గుణాలను పుణికిపుచ్చుకున్న మన మార్గదర్శకులు డా.పద్మావతి గారు డా.డీఆర్కే గారు తమ కార్యకర్తలను ఈ దిశగా నడిపించారు.

        " సేవ చేయంగాలేని మనసదేల

         మొక్కలు నాటంగలేని చేతులేల

       మృదువుగా మాటాడని జిహ్వలేల

        ధైర్యముగా అడగులేయని పాదములేల

      లక్ష్య సాధనే నీదృష్టి ఓ కార్యకర్తా

                           సువర్ణాధ్యాయం

మనం చేసే పనికి గుర్తింపు వస్తే...

 గుర్తింపు కోసం పని చేయని ఉద్యమానికి ప్రభుత్వం నుండి పిలుపు వస్తే.....

  సచ్చంధ్ర కమీషన్ ఏర్పడ్డాక జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు విభిన్న మార్గాలలో నడుపుతున్న వారిని నవనిర్మాణ దీక్ష లో కొన్ని వేలమంది ముందు  వీడియో ప్రదర్శించమన్నారు.

మనకూ పిలుపు వచ్చింది.

అది 06.06.2017 . స్వచ్ఛ సుందర చల్లపల్లి,  ప్రభుత్వం ద్వారా , అదీ ఒక సీఎం ద్వారా బహిర్గతమై ఆంధ్రప్రదేశ్ అంతటా చల్లపల్లిలోని  శ్రమ జీవనం తెలిసింది.

 photo exhibition కి కావలసిన సామాగ్రితో మేము ఆరోజు 10 గం.కు బయలుదేరాం.

నేను, బృందావన్, గోపాలకృష్ణయ్యగారు, సజ్జా ప్రసాదుగారు.

 డాక్టరు గార్లు మరో కారులో.

స్వచ్ఛ చల్లపల్లి పై power point presentation  5 నిముషాలలో వీడియో చూపించాలన్నారు.

స్వచ్ఛఆంధ్ర మిషన్ డా.వెంకట్రావు గారు కనబడలేదు.మధ్యాహ్నం నుండి వచ్చిన వారంతా వారివారి ప్రదర్శన తయారీలో మునిగిపోయారు.

 మనకు స్థలం చూపలేదు.

 సీఎం వద్ద ఎక్కువ మాట్లాడగూడదు. వీడియో క్లుప్తంగా ఉండాలని కలెక్టర్ గారు అన్నారు.

 ఎలాగొలా ఫోటోలు స్టాండ్లకు బిగించి గేటుకు రెండువైపులా నిలబెట్టాము. ఎవరూ వుండగూడదు. లోపల కూర్చోమన్నారు.

 జోరు వాన. టెంట్ల కింద తడవని వారు లేరు.

7 గం.కు సీఎం వచ్చారు.

ఒకరిద్దరిని ప్రశ్నలడిగారు. తరువాత డాక్టరు గారిని పిలిచారు. పెద్ద స్క్రీన్ పై చల్లపలి వీడియో ప్రదర్శిస్తూ వివరించారు.

అప్పటివరకు కూర్చుని లాప్ టాప్ లో చూస్తున్న సీయంగారు మన డంపింగ్ యార్డు పాత చిత్రం, వెనువెంటనే మనం అపురూపంగా తయారు చేసికొన్న ఉద్యానవనం చూడగానే

ఒక్కసారిగా సీఎం చంద్రబాబు గారు నిలబడి పెద్దస్క్రీ న్ చూడడం. అందరినీ ఆశ్చర్య పరచింది.

 అంతకన్నా పరమాశ్చర్యం

డాక్టరుగారిని, మీకు టైంతో పనిలేదు,  ప్రసాదుగారు ,కావలసినంత టైం తీసుకొని వివరించండి అన్నారు.

పూర్తి వీడియో చూశాక డా.పద్మావతి గారిని, డా.డీఆర్కే గారిని చాలా గొప్పగా 939 రోజుల సేవ గూర్చి అభినందించారు.

ఆహుతులతో  మన చల్లపల్లి సేవ గురించి చెప్పి 5,6 సార్లు చప్పట్లు కొట్టించారు.

 డా.పద్మావతి గారు త్వరలో 1000 రోజులు పూర్తి అవుతాయని అనడమే తరువాయి అమ్మా నేను మీ 1000 రోజుల పండుగకు స్వయంగా వస్తానని చెప్పడం ముదావహం.

అప్పటిదాకా వీడియో కై సమయం చాలదు, వద్దు అన్న కలెక్టరు గారు అధికారులు ప్రశంసలు కురిపించారు.

 డాక్టరు గార్లను ప్రశ్నలతోను, అభినందనలతో ముంచెత్తారు.

 అప్పటివరకు ఎవరికీ తెలియని చల్లపల్లి, వేనోళ్లల్లో పడి స్వచ్ఛ సుందర చల్లపల్లి అయింది.

 స్వయంగా సీయంగారు నే వెళ్లిన చోట చల్లపల్లి గురించి తెలుపుతాననీ , స్వచ్ఛ భారత్ కు ఆదర్శమనీ చెప్పి అన్ని గ్రామలవారినీ దర్శించుటకు పంపుతామన్నారు.

 వానలో తడిసినది మరచి మమ్ములను గూడా మా యూనిఫామ్ చూసి ఎంతో గౌరవించారు.

 డా.పద్మావతి, డా.డీఆర్కే గార్ల శ్రమసంస్కృతి కై కన్న కలలలో ఒకటి సాకారమైంది.

 మన చల్లపల్లి విలేఖరులు, వారిచ్చిన స్పూర్తికి ఫలితమొచ్చిందని ఆనందించారు.

                     ఎంత గొప్ప సువర్ణాధ్యాయమో గదా.

 

భూగర్భడ్రైనేజీ ఏర్పడిన తరువాత పైన అతి సుందరంగా సిమెంటు రోడ్డు ను రోడ్డు కిరుపక్కల పేవరు టైల్స్ తో సుందరంగా తీర్చిదిద్దారు.

ఇంత అందమైన రోడ్డుకు సొగసులు దిద్దారు మన డా.పద్మావతి గారి సృజనాత్మక సృష్టి సుందరబృందం .

దుర్గా వాసులు, మాధురీ పద్మావతులు , మధ్యన స్నేహ గూడా నెల రోజులు శ్రమించి  కుడ్య చిత్రకళతో

సర్వాంగ సుందరంగా  కనువిందు చేశారు.

ప్రాతూరి శాస్త్రి

22.08.2020.