ప్రాతూరి శాస్త్రి - 12.09.2020. ....           12-Sep-2020

 Arise, awake, stop not till the goal is reached

 పేవర్ టైల్స్

            డా. పద్మావతి, డా.డీ.ఆర్కే. ప్రసాదు గార్ల ముద్దుబిడ్డ స్వచ్ఛ చల్లపల్లి. ఈ ముద్దుబిడ్డ బాలారిస్టాలు దాటుకుంటూ అందమైన యువతిగా ముస్తాబౌతోంది.

            చల్లపల్లికి పేవర్ టైల్స్ రావడానికి ఓ కారణం ఉంది.

            డా.పద్మావతి గారు, డా.డీ.ఆర్కే.ప్రసాదు గారు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన చేశారు 2016 జనవరిలో.

            కేవలము విహారయాత్రకు గాక అచట జరిగే పారిశుధ్య కార్యక్రమాలు, నగరాల్లో చెత్త సేకరణ, ఆయా నగరాలు అందంగా ఉండడానికి కారణాలు, డ్రైన్ వ్యవస్థ పరిశీలించారు.

            అక్కడ రహదారులు, door to door ఉండడం గమనించి, రహదారి వనాలను పరిశీలించి మన గ్రామంలో కూడా  ఇలా ఎందుకు ఉండకూడదు అన్న భావన వచ్చింది.

            పర్యటనలో ఉన్న రోజుల్లో చల్లపల్లిలో జరిగే స్వచ్ఛ కార్యక్రమాలు విచారించేవారు. మన సమయం ప్రకారం ఫోన్ చేసి సలహాలు ఇచ్చేవారు.

            స్వదేశం వచ్చాక ఉదయ్ సింగ్ గౌతమ్ గారి సలహతో ప్రథమంగా 1 వ వార్డు ముఖ ద్వారం వద్ద పేవర్ టైల్స్ వేయించారు. డా.పద్మావతిగారు ప్రారంభించే రోజు దాదాపు 500 మంది రావడం విశేషం.

             బుద్ధప్రసాద్ గారు, లంకబాబు గారు, పంచాయతీ సర్పంచ్, పంచాయితీ సెక్రటరీ ప్రసాదు గారు, చర్చి పాస్టర్లు, జడ్ పిటీసీ కృష్ణకుమారి గారు, కొడాలి మురళి 1వ వార్డులోని పెద్దలు, ఆసుపత్రి సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

            ఆరోజు తీసిన వీడియో ఈనాటికీ కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. మునసబుగారి బజారు ప్రారంభం నుండి ఇంతమంది నినాదాలు తెల్పుతూ slow walking గా వస్తూ టైల్స్ వద్దకు చేరారు.

             ప్రముఖులందరు ప్రశంసించారు.

            తదుపరి ముసబుగారి బజారు ముఖద్వారం పేవర్ టైల్స్ తో అలంకరించబడింది.

            జూనియర్ కాలేజీ ఎదురుగా shopping complex ఉంది. ట్రస్టు నుండి పేవర్ టైల్స్ ఇచ్చేటట్లు, షాపుల ముందు వేయడానికి అయ్యే ఖర్చు వారు భరించేటట్లు ఒప్పందం జరిగింది.

            SRYSP కాలేజి నుండి రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు ట్రస్టు భరించింది.

            డా.పద్మావతి గారి కోరిక కాలేజీ నుండి బస్టాండ్ వరకు రోడ్డు కిరుపక్కల టైల్స్ వేయించాలని.

            కార్యకర్తలు దుకాణాల వారితో మాట్లాడి చల్లపల్లి సెంటరు లో కొంతవరకు టైల్స్ వేయించడం జరిగింది. పల్నాటి రాజబాబు, గోపాలకృష్ణయ్య గారు, విజయకుమార్, వాసు మాస్టారు మరికొందరు విరివిగా శ్రమజేశారు.

            వినాయకుడి గుడి వద్ద ఓ కాంప్లెక్స్ ఉంది వారిని గూడా ఒప్పించడం టైల్స్ వేయించడం జరిగింది.

            ఆనంద ఆదివారాలు ఏటీఎం సెంటరులో జరిగేవి. ఒక్కప్పుడు ఆ ప్రదేశం బాగుండేదికాదు. ఉదయం 5 గం కే వచ్చి శుభ్రం చేసేవారు.

            అచ్చటి దుకాణాల యజమానులతో చర్చించి కొంత ట్రస్ట్ భరించి పేవర్ టైల్స్ వేయించారు.

            కార్యసాధకులకు సహనమే శ్రీరామరక్ష. భగీరథ ప్రయత్నాలతోనే మనం అనుకున్నవి సాధించగలుగుతాము.

            దుబాయి లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న స్నేహ, కుమార్ గార్ల ద్రవ్యంతో సంత బజారు నుండి C.I గారి ఆఫీస్ వరకు మనకోసం మనం ట్రస్టు ద్వారా పేవర్ టైల్స్ వేయించారు. 

            ఎంతైనా ఒకనాటి చల్లపల్లి వేరు శ్రమసంస్కృతి అలవాటైన ఈనాటి స్వచ్ఛ సుందర చల్లపల్లి వేరు.

- ప్రాతూరి శాస్త్రి

12.09.2020.