ప్రాతూరి శాస్త్రి - 19.09.2020.....           19-Sep-2020

 గ్రామ ప్రగతికి కుడ్య చిత్రకళ వన్నె తెచ్చింది

            బందరు రోడ్డులో చినరాజా వారి స్థలం వుంది. గోడ 100మీ పొడుగు, 50 మీ వెడల్పు.

            2 సంవత్సరాల నుండి ప్రయత్నం చేయగా ఈ సంవత్సరం అనుమతి రావడంతో గోడలు గీకి, ప్రాకారాల .. గోపురాల ఫలకాలు శుభ్రంచేసి చిత్తరువులు వెలికి తీశారు.

            ఒకటి వైజయంతం, రెండవది గోకులవాసము. ఫలకాల చుట్టూ లతలు, తీగలు, పైన గోపురాలు బంగారు రంగుతో మిలమిల మెరిసాయి.

            ఫలకాలలోని చిత్రాలకు రాగి రంగు వేశారు.

            గోపుర ప్రాకారంలో ఒకవైపు విరిగినది. ఒక కార్యకర్త ధర్మోకోల్ తో అంచు తయారుచేసి అతికించి రంగు వేసినారు.

            100 మీ గోడపై పుష్ప చిత్రాలు, నినాదాలు వ్రాసారు. దారిన వెళ్ళేవారందరికీ అకర్షిస్తున్నాయి.

            "గోడమీద అంచుకు వేసిరి ఆకర్షణీయ డిజైనులు, కడదాకా కార్యకర్తలు.

            గోడ సొగసు పెంచ పుష్పరాజాలు వేసిరి

            సహచరులు లతలు, తీగలు రంగులు దిద్దిరి

            నడయాడుచు సుందర బృందం చిత్రపు రంగులు వేసిరి.

            సజ్జావారి బజారు ముఖద్వారం ఎడమ గోడ రూపురేఖలు మార్చేశారు నూతన డిజైనులతో.

            ట్రాన్స్ఫార్మర్స్ దిమ్మను కూడా వదలక దానిపై మయూరి చిత్రం ఆమోఘంగా చిత్రించారు కార్యకర్తలు.

            చినరాజా వారి గోడపై కడకు స్వచ్ఛ హరిత డిజైనులు, మౌన తపస్విని చిత్రాలు సుందరంగా చిత్రించారు.

            ప్రయాణీకులు క్షణకాలం. ఆగి చిత్రాలజూసి వెళ్లడం సుందరకర్తలకు ఆనందం కల్గింది.

            సుందరబృంద చిత్రకళ మనోహరంగా వేయసాగిరి. ఒకరిని మించి మరొకరు చిత్రకళలో నిష్ణాతులైయ్యారు.

25 దినముల పిదప పాగోలు కల్వర్టు గోడలకు రంగులేయడం ప్రారంభించారు.

            పాగోలు కల్వర్టు

            సుందరబృందం రంగులమేళా

            నలుగురు ప్రతినిధులు ఇద్దరు సహచరులు

            పూలగుచ్ఛాలు రంగులు వేసిరి

            అక్షరాలకు షేడింగ్ చేసిరి

            రెండోగోడ అంచుకు డిజైను వేసిరి

            డిజైనును మృదువుగా మెరిపించిరి

            కలబోసి అందరినీ చూస్తే పెళ్లికి ఇంటికి డిజైను వేస్తూ

            చాలా బిజీగా వుంటూ మధ్య లో జోకులేస్తూ పనిచేసే వారిలా

            ప్రతిరోజూ మనకు కనబడే దృశ్యం.

            పుష్పగుచ్ఛాలను పావురాలు తీసికొని వెళ్తున్నట్లు వేసిన చిత్రం ఒక శాండీలయిర్ లా ఆకర్షిస్తోంది.

            నాగాయలంక రోడ్డులో టాయ్లెట్ గోడకు వేసిన చిత్రాలు దారిన వేళ్ళేవారికి ఆనందం కలిగిస్తున్నాయి.

- ప్రాతూరి శాస్త్రి

19.09.2020.