ప్రాతూరి శాస్త్రి 20.09.2020. ....           20-Sep-2020

 స్వచ్చ చల్లపల్లి - కాఫీ కబుర్లు

            ‘స్వచ్చ చల్లపల్లికార్యక్రమం మొదలైన కొత్తలో 6 గంటలకి కార్యక్రమం ముగిసిన తరువాత అందరం ఇళ్ళకు వెళ్లిపోయేవాళ్లం. కొద్ది రోజుల తరువాత దాసి సీతారామరాజు గారు అప్పుడప్పుడు టీతెప్పించి కార్యకర్తలకు ఇస్తుండేవారు. ఆ కాలంలో ప్రతి బుధవారం విజయవాడ నుండి డా. శివన్నారాయణ గారు వస్తుండేవారు. వారు వచ్చినప్పుడు వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు రాజేశ్వరి గారితో ఇంట్లో కాఫీ పెట్టించి అందరికీ ఇస్తుండేవారు. కొన్ని వారాల తరువాత అందరికీ ప్రతి రోజు కాఫీ లు ఇవ్వడం మొదలుపెట్టారు.

            ‘మాష్టారూ! రోజూ రాజేశ్వరి గారిని ఇబ్బంది పెట్టవద్దు కాఫీ ఏర్పాట్లు నేను చేస్తానుఅని ఒకరోజు చెప్పాను.

            ‘ఉగాది వరకు నేనే కాఫీ లు తెస్తాలేండి తరువాత మీరు ఏర్పాటు చేద్దురు కానీఅని చెప్పారు మాష్టారు.

            2015 లో ఉగాది పండుగ అయిన మార్చి 21వ తేదీ వరకూ వారే కార్యకర్తలందరికీ కాఫీ లు ఏర్పాటు చేశారు. అలా మాష్టారు అలవాటు చేసిన కాఫీ సేవనాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆనందిస్తున్నాము.

 

- ప్రాతూరి శాస్త్రి

20.09.2020.