ప్రాతూరి శాస్త్రి - 29.09.2020. ....           29-Sep-2020

 సుందర చల్లపల్లి లో క్రిస్మస్ సంబరాలు - 25.12.2016.

కులాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా,

స్వచ్ఛ సైనికులంతా ఒకేకులం, ఒకేమతం. 

సుందర చల్లపల్లిలో క్రిస్మస్ సంబరాలు:

            అప్పటి ZPTC కృష్ణకుమారి గారు, లాయరు మురళి గారు కేక్, లడ్డూలు తీసికొనిరాగా, ప్రశాంతమణి గారు పులిహోర, హాస్పిటల్ వారు కాఫీలు తేగా డాక్టరు గారి దంపతులు కేకు కోసి Happy Christmas ప్రారంభించారు.

ఏసు నామమే జీవనము, ప్రభు ఏసే నిత్యానందం

ఒకరు గానం చేయగా

శిలువ చెంత చేరిననాడు అని మరొకరు

కరుణించు మేరి మాతా అంటూ మరొకరూ గానం చేస్తూ ఆనంద పరవశులైనారు

అనంతరం గురవయ్య మాస్టారు బైబిలు సూక్తులు తెలిపినారు.

బైపాస్ రోడ్డులో డాక్టరు గారింట క్రిస్మస్ ఆనందహేల మహదానందంగా జరిపినారు.

- ప్రాతూరి శాస్త్రి

29.09.2020.