ప్రాతూరి శాస్త్రి - 10.10.2020. ....           10-Oct-2020

 "ఆకుపచ్చ చల్లపల్లి, ఐకమత్య చల్లపల్లి సేవజేయు పాలవెల్లి"

                  ......

శ్రీ  జె.డీ.లక్ష్మీనారాయణ గారి చల్లపల్లి సందర్శన.

1408 వ రోజు. సుందర చల్లపల్లి 19.09.2018

ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం.

పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యతే.

పూవు పరిమళం దశదిశల వ్యాపిస్తున్నదంటంలో అతిశయోక్తి లేదు.

జీవితం అందుకోలేని, అందుకోగల అవకాశాలు వస్తూనేవుంటాయి.

వాటిని అందిబుచ్చుకుంటే  సుఖమయమే.

నీవు చేసేపని నిస్వార్థ మైతే నిన్ను వెతుక్కుంటూ అందరూ వస్తారు.

నీవు నాగురించి ప్రచారం చేయనవసరం లేదు.

 

ఈనాడు 

జె డి లక్ష్మీనారాయణ గారి స్వచ్ఛ సుందర చల్లపల్లిని దర్శించడానికి రావడం.

రావడం చూడడమేకాదు మనతో కలిసి పనిచేయడం విశేషం.

కార్యకర్తలందరితో ప్రతిఒక్కరితో మాట్లాడారు.

మీవూరి గురించి విన్నాను, పేపర్లో చదివినాను, ప్రత్యక్షంగా చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు.

యువత కు సరైన అవగాహన కల్పిస్తే భవిష్యత్తు బంగారు బాటవుతుంది.

పాఠశాలలలోని విద్యార్థులకు సైతం సామాజిక స్పృహ కలిగించాలన్నారు.

ఉదయం 4.30 ని నుండి 8 గం. వరకు స్వచ్ఛ సుందర చల్లపల్లి లో గడిపినారు.

 

- ప్రాతూరి శాస్త్రి

10.10.2020.