ప్రాతూరి శాస్త్రి - 22.10.2020....           22-Oct-2020

 పంచాయితీ కార్యదర్శి - బి.ప్రసాదు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనలో ముఖ్య భూమిక వహించింది, పంచాయితీ కార్యవర్గం, కార్యదర్శి శ్రీ ప్రసాదు గారు.

పంచాయితీ కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తూ స్వచ్ఛ చల్లపల్లికి ఎనలేని సేవచేశారు.

చల్లపల్లి కి వెన్నుముకగా వుంటూ పంచాయితీ నుండి కావలసిన అనుమతులు, అధికారులతో సంప్రదింపులు జరిపి స్వచ్ఛ చల్లపల్లి తనదిగా ఉహించుకుంటూ సేవజేశారు.

తానూ ఓ కార్యకర్తగా స్వచ్ఛ చల్లపల్లి కి సేవ జేసేవారు.

వర్మీ ఎరువు తయారీకి అవసరమైన పేడ దిబ్బలు స్వచ్చ కార్యకర్తలతో ట్రాక్టరులో లోడుచేసేవారు.

స్వచ్ఛతాసేవ కార్యక్రమం కార్యకర్తలతో జయప్రదం జేసి ఉత్తమ పంచాయతీ అవార్డు, ఉత్తమ కార్యదర్శి అవార్డు సాధించారు.

జన్మభూమి కార్యక్రమాలు Live show గా ఏర్పాటుజేసి అందరి మన్ననలు పొందారు.

చల్లపల్లి ODF గా ప్రకటించడానికి  డా.పద్మావతి గారితోనూ, టాటా కంపెనీ వారితోనూ ప్రభుత్వం తరపున టాయ్లెట్ లు గ్రామంలో కట్టించడానికి చాలా శ్రమజేశారు.

- ప్రాతూరి శాస్త్రి

22.10.2020.