ప్రాతూరి శాస్త్రి - 03.11.2020. ....           03-Nov-2020

 సుధామూర్తులు మన స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు

 

"ఏ నరునకు సేవాబాధ్యత గలదో

ఆ నరుడు కులీనుడు, అధికుడు

ఈ నరుడే ధన్యుడు, నేర్పరి

                      సేవ

నృపాలపూజితము,యశస్సు

సేవకు సాటి ధనంబు లేదిలన్.

 

"Leaders are born not made," says Vince Labored.

Leadership styles varies with maturity, followers and situations.

వృక్షో రక్షతి రక్షితః.

ప్రకృతి రమణీయత చెట్ల వల్ల లభిస్తుంది.

ఒక వూరి భవిష్యత్తు మార్చడానికి ప్రకృతి సహకరిస్తే,

ఒక వూరి అభివృద్ధికి కార్యకర్తలు నిస్వార్థంగా సహకరిస్తే,

ఒక వూరి పారిశుధ్య వ్యవస్థ

క్రమశిక్షణతో జరిగితే

ఒక వూరి పచ్చదనం, పరిశుభ్రత రాష్ట్రీయ, జాతీయ హోదా లభిస్తే,

ఇవన్నీ సాధించాలంటే నియమ నిబద్ధత గల్గిన వ్యక్తి వల్లే సాధ్యం.

లక్ష్య సాధన కోసం సంకల్పబలం గలిగివుండి నిరంతర ప్రయత్నం చేసే సహనం ఉన్నవారే కార్యసాధకులు.

మొదట కేవలం రహదారుల పరిశుభ్రతతో ప్రారంభించి పచ్చదనానికి అంకురార్పణ జేసి సడలని వజ్రసంకల్పంతో డంపింగ్ యార్డును సాధింపజేశారు.

కార్యకర్తలలో ఆవేశాలు తగ్గించి సహనం పాలు పెంచడంలో కృతకృత్యులైనారు. క్రమశిక్షణాయుత పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటులో గ్రామాధికారులతో చర్చించి పెనుమార్పులు తెచ్చారు.

చేతి సంచుల వాడకం ప్రజలలో రావాలంటే గ్రామంలోని ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించడం ప్రభుత్వ సాయానికి తోడు మరుగుదొడ్లు కట్టుకుంటానికి ఆర్థికసాయం ఏర్పరచడం ప్రజలలో మార్పు రావాలంటే దానికనుగుణంగా చైతన్యం కలిగించడం బహుమతులు ఇవ్వడం, తీసికోవడాన్ని స్వస్తి పలికించి సేవాబాధ్యత కార్యకర్తలలో కలిగించడం విపత్కర పరిస్థితుల్లో గూడా సడలక ధైర్యంతో ఉద్యమాన్ని నడపడం ఓ నియమబద్ధ ప్రణాళికతో డా. పద్మావతి గారితో చర్చిస్తూ స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమమాన్ని కడు ధైర్యంతో ముందుకు తీసికొని వెళ్లు తున్నది మన ప్రియతమ మార్గదర్శకులు డా.డీఆర్కేప్రసాదు గారు.

            ముప్పదియైదు రోజుల తరువాత అడుగిడిన డా. పద్మావతి గారి స్వచ్ఛ చల్లపల్లి ప్రవేశం బాలికల హాస్టల్ వద్ద కమలాలు నిర్మించడంతో ప్రారంభమైంది.

             ఆనాడే సుందరీకరణ కు శ్రీకారం చుట్టారు.

            సాహసోపేత ధైర్యజీవనానికి ఆద్యులు డా.పద్మావతిగారు.

రహదారివనాల ఏర్పాటు, బస్టాండు సుందరీకరణం, పార్కులోను, నాగాయలంక రోడ్డులోను పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, డంపింగ్ యార్డు సుందరీకరణ, చెత్త నుండి సంపద కేంద్ర నిర్వహణ, ఆమె వ్యవహారదక్షతకి నిదర్శనం.

            కేవలం 900 రోజులలో ODF గా ప్రభుత్వం ప్రకటించడంలో డాక్టరమ్మ గారి కృషి శ్లాఘనీయం.

            పాఠశాలల్లో, కాలేజీలలోని విద్యార్థుల యందు స్వచ్ఛ ఉద్యమ స్ఫూర్తి కలిగించడంలో మా రధసారధులు కృతకృత్యులైనారు.

              సాహసోపేతమైన నిర్ణయాలు తీసికోవడంలో రుద్రమదేవి.

               దీనికి అంకురార్పణ గా సుందరబృందము ఏర్పడి గ్రామంలోని వంతెనలు, మాసిన గోడల రంగులీనడంలో ప్రతిభ చూపిన మహిళా మహారాణి.   

            మార్గదర్శకంగా వుంటూ తానూ ఓ కార్యకర్తయి పనిచేసే ఓ Nightingale of challapalli.

            ధరను అందంగా తీర్చిదిద్ది వసుంధర పురస్కారాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అందుకున్న ఓ Jon of arc.

            స్వచ్ఛ చల్లపల్లి వుద్యమానికి రెండు కళ్ళు మా రధసారధులు. చేతులు, కాళ్ళు వారి కార్యకర్తలు, దేహం చల్లపల్లి గ్రామం.

            దేహ శుభ్రత ఎంత అవసరమో అంతే అవసరం. గ్రామానిపై కూడా చూపిన సంయమీంద్రులు.

            ఎన్ని పురస్కారాలు అందుకున్నా మేము నిమిత్తమాత్రులము ఈ కృషి అంతా మా కార్యకర్తలదే అంటారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎన్నో గ్రామాలవారికి ఆదర్శభూతులు ఈ తాత్వికులు.

            స్వచ్ఛ సుందర చల్లపల్లి సైన్యానికి మా రధసారధులు Brigadiers.     

            పట్టు పట్టగ రాదు, పట్టు విడువరాదు,

            పట్టేనేని బిగియపట్టవలయు

అని వేమన అన్నట్లు మా రధసారధుల నేతృత్వంలో కార్యకర్తలలో పట్టుదల, దీక్ష, త్యాగనిరతి ని నింపి స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనకు దగ్గరౌతున్నారు.

            కరోనా వచ్చి లాక్ డౌన్ విధించినా అధికారులతో చర్చించి పారిశుధ్య కార్యక్రమం సజావుగా సాగిస్తున్నారు.

            నాలుగు నెలలు కరోనాలో సేవజేసినా, గ్రామాలలో సైతం ఉదృతుంగా ప్రబలుతున్న కరోనా వల్ల తాత్కాలికంగా ఆపివేయబడింది. 

- ప్రాతూరి శాస్త్రి

03.11.2020.