ప్రాతూరి శాస్త్రి - 05.11.2020. ....           05-Nov-2020

 ముత్యాల సరాలు

 

తలచిన తలపులు

తలుపుల తట్టే మోదముతో

తలుపులు తెరిచిరి సావధానంగా

తలపుల సాకారముజేసిరి

తలచిన వారి మది పులకుంచగా.

 

ఖగపతి సేవామృతము తేగా

పొంగిపొరలి కొన్ని బిందువులు

చల్లపల్లి పై జాలువారగా

గ్రోలిన వారెల్ల స్వచ్ఛ కార్యకర్తలైరి.

 

దారెరుగాని వారు

దారితెలిసిన వారి తోడైరి

రుచిమరిగిన ఆవకాయను సేవించినట్లు

శ్రమజీవనమునకు అంకితమైరి.

 

చలికి వణకరు

వడగాలికి జంకరు

జలధారలకు బెదరరు

అన్ని ఋతువుల చేసేదరు సమమైనసేవ.

 

మోదముతో సేవావాసము

ప్రమోదముతో  ఉద్యానవనాలు

ఆమోదముతో అవార్డుల స్వీకారము

శిక్షణాయుత మార్గదర్శకత్వము

సుందర చల్లపల్లి కి సుగమమయ్యే.

 

పనసతోనలకన్న, పంచదారకన్న

చెరుకురసము కన్న, జున్ను కన్న

చిత్రకళ ఎంతో మధురమన్న

కుడ్యచిత్రాల కాద్యులు సుందరబృంద మన్న.

 

కాయము, గేహము ఒక్కటిగా జేసి

మాయకు లొంగక మక్కువగా జేయ

సాహస కృత్యములకు ముందంజ వీరు

ఊహింప శక్యము గాదు రక్షకదళ సేవ.

 

ఒకచే గొర్రు పట్టి

           ..   కత్తి మరొక చేతిన బట్టే

సేవకావసరమౌ పనిముట్లు తాగైకొని

అపర భగీరధుని వలె

                 ఊరి నందనము గావింప

నిలిచే సుందర సృష్టికర్త

                  మాయమ్మ డా. పద్మావతి.

- ప్రాతూరి శాస్త్రి

05.11.2020.