బి. వీరాంజనేయులు....           09-May-2020

  2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు –

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 6

2000 రోజుల అద్భుతానికి అభినందనలు

          శుచి, శుభ్రత, సామాజిక బాధ్యత, పరిపక్వత, చైతన్యం, ఆరోగ్యం, అందం, ఆనందం వంటి మానవ విలువలతో గూడిన స్వచ్చ – సుందర చల్లపల్లి ఉద్యమం మీ నిత్య జీవితంలో భాగమైపోయి 2000 దినాలు దాటింది.

          మూడు దశాబ్దాల జనవిజ్ఞానవేదిక అనుభవ నేపధ్యంలో – జనం మధ్య నిరంతరం పని చేసిన పరిణతితో – శాస్త్రీయంగా రూపొందించుకొని, ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా, నిస్వార్ధంగా, స్వచ్చందంగా, సుదీర్ఘంగా మీరు నిర్వహించుకొంటున్న స్వచ్చ చల్లపల్లి ఉద్యమం మీ గ్రామానికి గరిష్ట సామాజిక ప్రయోజనాన్ని సాధిస్తున్నది.

          మాబోటి వారికి, పాతిక – ముప్పై గ్రామాల ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా – మార్గ నిర్దేశకంగా నిలుస్తున్నది. భ్రష్టమైపోతున్న, సోమరిగా మారుతున్న ఈ నాటి సమాజానికి మీ ఉద్యమం సమయోచితమైన చికిత్స అనుకొంటున్నాను. ఆలు పెరగని స్వచ్చ – సుందర చల్లపల్లి కార్యకర్తలందరికి నా అభినందనలు!

- బి. వీరాంజనేయులు,

రిటైర్డ్ ప్రిన్సిపల్, చిలకలూరి పేట