1975*వ రోజు....           08-Apr-2020

 ఒక్కసారికి మాత్రం పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎందుకు వాడాలి

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1975* వ నాటి స్వచ్చ శుభ్ర కృషి సమీక్ష :

          నేడు 4.01 నుండి 6.00 గంటల వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. తరిగోపుల ప్రాంగణం వద్ద ఆగి చిల్లలవాగు నుండీ వక్కలగడ్డ కమతావానిగూడెం రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా కలుపు మొక్కలను తీసివేసి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తయారుచేశారు.

          మరికొంతమంది కార్యకర్తలు చిల్లలవాగు ఉత్తరపు గట్టుకు చేసిన రివిటింగ్ రాళ్ళ మధ్య నుండి పెరిగిన కలుపు మొక్కలను నరికి శుభ్రం చేశారు.     

          సుందరీకరణ బృందం వారు బందరు రోడ్డులో ఉన్న 6 వ నంబరు పై ఉన్న కల్వర్టు ఉత్తరపు గోడకు రంగులు వేసి, నినాదాలు రాసి, బొమ్మలు వేసి అందంగా తయారుచేశారు.  

          రేపటి స్వచ్చ కార్యక్రమం కోసం విజయవాడ బాట ప్రక్కన గల తరిగోపుల ప్రాంగణం వద్ద కలుద్దాం.

                      నిజంగానే...

ప్రాలు మాలక – బద్ధకించక – గ్రామ హితమును నిలిపివేయక

స్వచ్చ గ్రామమె ప్రప్రధమమై – స్వంత పనులవి వాయిదాపడి

నమ్మశక్యంకాని కృషితో న్యాయ మార్గంలో చలిస్తే

స్వచ్చ సైన్యం నిజంగానే చల్లపల్లిని సంస్కరిస్తుందా!  

- నల్లూరి రామారావు,

- డా. డి. ఆర్. కె. ప్రసాదు,

(స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు, మనకోసం మనం ట్రస్టు బాధ్యులు)

బుధవారం – 08/04/2020

చల్లపల్లి. 

4.10 కు తరిగోపుల ప్రాంగణం వద్ద
బందరు రోడ్డులో ఉన్న 6 వ నంబరు పై ఉన్న కల్వర్టు ఉత్తరపు గోడ