ఒక్కసారికి మాత్రం పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎందుకు వాడాలి?
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1977* వ నాటి స్వచ్చ శుభ్ర కృషి సమీక్ష :
నేడు 4.07 నుండి 6.00 గంటల వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 25 మంది. తరిగోపుల ప్రాంగణం వద్ద ఆగి చిల్లలవాగు ఉత్తరపు గట్టుకు ఇరువైపులా కలుపు మొక్కలను తీసివేసి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తయారుచేశారు.
మరికొందరు వక్కలగడ్డ వైపుకు రోడ్డుకు ఎడమ వైపున ఉన్న డ్రైన్ గట్లను శుభ్రం చేశారు.
సుందరీకరణ బృందం వారు తరిగోపుల ప్రాంగణముకు, చిల్లలవాగు వంతెనకు మధ్య గల ప్రాంతంలో ఎత్తుపల్లాలను సరిచేశారు. వంతెన భాగాన్ని శుభ్రం చేశారు.
రేపటి స్వచ్చ కార్యక్రమం కోసం తరిగోపుల ప్రాంగణం వద్ద కలుద్దాం.
8 నుండి 80 దాక
స్వచ్చ ధన్య చల్లపల్లి విజయ కధాక్రమంబిదే....
సామాజిక ఋణ విముక్తి సద్భావనతో కొందరు –
శ్రమ బంధుర – సుమసుందర స్వగ్రామం సాధనకై
ఎనిమిది – ఎనభై ఏళ్ల వ్యక్తులు కృషి చేయడం!
- డా. డి. ఆర్. కె. ప్రసాదు,
(స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త, మేనేజింగ్ ట్రస్టీ - ‘మనకోసం మనం’)
శుక్రవారం – 10/04/2020
చల్లపల్లి.