ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1981* వ నాటి శ్రమదాన సంగతులు :
నేటి ఉదయం 4.03-6.10 వేళల నడుమ జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 32 మంది.
విజయవాడ రోడ్డు లో పెట్రోలు బంక్ వద్ద ఆగి కొంతమంది కార్యకర్తలు చండ్ర రాజేశ్వర రావు గారి వికాస కేంద్రం నుండి బైపాస్ రోడ్డు వరకు ఉన్న కలుపు మొక్కలను తీసి వేశారు.
కొంత మంది కార్యకర్తలు రోడ్డు కిరువైపులా గతంలో పంచాయతీ వారు డ్రైన్లను తవ్వి ఒడ్డున వేసిన మట్టిని అందంగా సర్దారు. వాటిలో ఉన్న ప్లాస్టిక్ కాగితాలను, మందు సీసాలను తీసి ట్రాక్టర్ లో లోడు చేసి డంపింగ్ యార్డు కు తరలించారు.
పంచాయతీ వారు ఇచ్చిన యాంటీ సెప్టిక్ లోషన్ ను స్ప్రేయర్ తో ఆ ప్రాంతమంతా చల్లారు.
సుందరీకరణ కార్యకర్తలు అమరావతి రాజా గారి ప్రహరీ గోడను నేడు కూడా శుభ్రంగా గీకి, ప్రైమరు ఆ పైన రంగును వేశారు.
రేపటి కార్యక్రమం కోసం విజయవాడ రోడ్డు లోని పెట్రోలు బంకు వద్ద కలుసుకొందాం.
ఇపుడు గూడ ఊరి మేలె
కరోనా కరాళ నృత్య క్రందనలో లోకమంత
జడలుగగుర్పొడుచు వార్తలొస్తున్నా నిశ్చింత!
తన పాటికి వేన వేల దినములుగా స్వచ్చ సేన
ఊరి మేలు కంకితమై ఉద్యమించు దినదినాన!
డా. డి. ఆర్. కె. ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ- మనకోసం మనం
మంగళవారం – 14/04/2020
చల్లపల్లి.