3421* వ రోజు....           23-Mar-2025

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

   జై స్పచ్చ చలపల్లి వాట్సాప్ పాఠక మహాశయులకు, గ్రామస్తులకు !

         అయ్యా/అమ్మా!

          విషయం:  అనితర సాధ్యంగానూ, సుదీర్ఘ కాలంగానూ జరుగుతున్న శ్రమదానంలో 3421*వ నాటి గ్రామ సేవల నివేదిక గురించి,

సమయం, సందర్భం: ఆదివారం (23-3-25) వేకువ 4.16 మొదలు 6.09 వరకు

విజయా కాన్వెంట్ లో జరిగే 23 వ ఏటి వైద్య శిబిర సందర్భం.  

         పని పరిమాణం; చల్లపల్లి ప్రభుత్వ వైద్యశాల ఎదుట 30+40 గజాల మురుగు కాల్వల, 100 గజాల వీధి బాగు చేత.

వేకువ సమయపు గ్రామ సేవకులు:  85 ఏళ్ళ వృద్ధ వైద్యునితో సహా 28 మంది  

+11 మంది వైద్య శిబిరంలో కార్యకర్తలు – మొత్తం 39 మంది.  

         పనుల స్వభావం : 1) ఉభయ డ్రైన్లలో గడ్డీ, పిచ్చి మొక్కల తొలగింపు,

2) బజారంతా ఊడుపు,3) ఆస్పత్రి ఆవరణలో 5 గురి కత్తుల, దంతెల, చీపుళ్ళ పనులూ,

4) ప్లాస్టిక్, గాజు బుడ్ల సేకరణ,  5) ట్రాక్టర్ నిండుగా సమస్త వ్యర్థాలు నింపుకొని,డంపింగు కేంద్రానికి చేరవేత వగైరాలు.

         విశేషాలు: ఈ ఎంగిలి – మురికి – గౌరవహీన కార్య కర్మలకై గ్రామ సర్పంచమ్మ , విశ్రాంత ఉద్యోగ వృద్ధులూ, ఉపాధ్యాయులు, పొరుగూరి రైతులూ పాల్గొనుట, జీత భత్యాలడగకుండ ఒడలు వంచి గ్రామం కోసం ఆ పనీ – ఈ పనీ అని లేక – ఏ సేవలకైనా ముని కాళ్ళ మీద నిలుచుట.   

కార్యకర్తలకు లబ్ది: తమ సొంతూరి శుభ్రతకు, సుందరీకరణకు, హరిత సంపదకు, గ్రామస్తుల ఆహ్లాదాలకు తమ వంతు శ్రమించామనే సంతృప్తి!

 ఇక నేటి తుది సభా విశేషాలు : విశ్రాంత రెవిన్యూ ఉద్యోగి శ్రీమాన్ రాయపాటి రాధా కృష్ణుని  “ జై స్వచ్చ సుందర చల్లపల్లి”, “స్వచ్చ సుందర చల్లపల్లిని సాధిస్తాం” అనే నినాదాలు.

రేపటి వేకువ పని స్థలం పాగోలు గ్రామ పరిధిలోని  NTR సాఠశాల వద్ద అనే  నిర్ణయం.

ఇది గాక ఇతర వివరాలు : సుమారు 1000  మంది ఫిట్స్, పక్షవాతం, షుగరు, బి.పి. రోగులకు గోపాళం శివన్నారాయణ గారి ఆధ్వర్యంలో

వేకువ 4-30 నుండి 11.00  వరకు వైద్య పరీక్షల్లో, మందుల పంపకం పనుల్లో నాతో సహా 11 మంది చేతనైనంత సహకరిచడం.

           ఎవరికెవరు ఋణ గ్రస్తులు?

ఎందుకు ఈ వైద్యసేవ లెందుకిన్ని వీధి పనులు ?

ఏమిటి ఈ వ్యసనంబులు ఎందుకిన్ని సవనమ్ములు?

దశాబ్దాల తరబడి ఈ సామాజిక బాధ్యతలు

 సమాజమూ – కార్యకర్త ఎవరికెవరు ఋణ గ్రస్తులు?

- ఇట్లు చల్లపల్లి స్వచ్చ సుందర కార్యకర్తల తరపున -

- ఒక సీనియర్ కార్యకర్త

- నల్లూరి రామారావు,

   23.03.2025.