భూమిలో ఎప్పటికి కరగని ఫ్లెక్సీలు వాడనే వద్దు ! భూమిలో కలిసి పోయే గుడ్ల బ్యానర్ల వాడకమే ముద్దు !
25-5-2025- ఆదివారం 3480* వ రోజు !
రాత్రి కురిసిన భారీ వర్షం వలన నేలంతా చిత్తడిగా తయారైనను మొక్కవోని దీక్షతో 4.22 ని.కు వేకువ ఝామునే 9 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరి కొద్ది సమయానికే 30 మందితో ఆ ప్రాంతమంతా పని సందడితో కళకళలాడింది.
హిందూ శ్మశాన వాటికకు వెళ్ళే దారిలో ఎత్తుగా పెరిగిన మొక్కలను మరియు చెట్లను ఒక క్రమ పద్ధతిలో మిషన్ ఉపయోగించి ఒకే సైజ్, ఒకే హైట్ లో చూపరులకు కన్నుల కింపుగా ఉండేట్లు చేసే ప్రక్రియను సుందరీకరణ బృందం చేపట్టింది.
ఆ మార్గంలోనే చెట్ల వద్ద మొదళ్ళ లోని కలుపును పీకి, చెత్తను వేరు చేసి పోగు పెట్టడం చేస్తూ ఇద్దరు కార్యకర్తలు, వారికి మాటలతో చేతలతో సహాయమందిస్తూ మరికొంత మంది కార్యకర్తలు కనిపించారు.
బాలికల హాస్టల్ గోడ ప్రక్కన డ్రైనేజ్ ని దంతులతో శుభ్రపరుస్తూ మరికొంత మంది దర్శన మిచ్చారు. చీపుళ్ళతో ఊడుస్తూ, చెత్తను పోగు పెడుతూ మహిళా కార్యకర్తలు, ఉత్సాహంగా ఎప్పుటి చెత్తను అప్పుడు లోడ్ చేస్తూ ఇద్దరు యువ కార్యకర్తలు డాక్టర్ DRK గారి మనసు చూరగొనటం కన్పించింది.
ప్రేమానందం గారు పలికిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి రేపటి శ్రమదాన వేదిక హైవేలోని కాసానగర్ వద్దనే అని తెలుసుకుని, ఉద్యమ ఖర్చుల నిమిత్తం తన మనుమడు జయాన్ష్
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి.
25.05.2025.
గ్రామ హితముగ చూడలేరా!
ఒక వినోదం చూసినట్లో - ఒక ప్రమోదం పొందినట్లో
ఎవరి పనులో చేసినట్లో - ఏ ఘనత సాధించినట్లో
కార్యకర్తల శ్రమ త్యాగం దూరదూరం నుండి చూచుట
కాక అందరు ఆచరించే గ్రామ హితముగ చూడలేరా!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
25.05.2025.