ఒక్కసారికి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు వద్దు!
పర్యావరణ హితమైన గుడ్ల సంమల వాడకమే ముద్దు!
28-5-2025 - బుధవారం 3483* వ రోజు!
వేకువ ఝామున 4:18 ని.లకు 18 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సేపటికే 39 మందితో ఊపందుకుంది.
డా. పద్మావతి మేడం గారి పర్యవేక్షణలో కాసానగర్ సెంటర్ కు మూడు ప్రక్కల గల డివైడర్ లలో బయట నుండి ట్రక్కులో తెచ్చిన సారవంతమైన మట్టిని మొక్కలు పెట్టుటకు అనువుగా సర్దడం జరిగింది.
కోడూరు వెంకటేశ్వరరావు, బృందావన్ గార్ల నాయకత్వంలో యువదళం సమక్షంలో కాసానగర్ సెంటర్ కు రెండు ప్రక్కల రహదారి అంచున 36 అడవి తంగేడు మొక్కలు క్రమపద్దతిలో నాటి పాదులు తీసి నీరు పోయటం జరిగింది. .
సజ్జా ప్రసాద్ గారి బృందం రహదారికి ఎడమ ప్రక్కన గల ప్రాంతాన్ని ఒక పర్లాంగు మీర రకరకాల పనిముట్లతో శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాస్తి ప్రసాద్ గారు, ప్రేమానందం గారు మరియు హాస్పిటల్ సిబ్బంది సహకరించడం జరిగింది.
నందేటి శ్రీనివాస్ బృందం రహదారికి మరొక ప్రక్క శుభ్రం చేయడం జరిగింది. ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తొమ్మిది మంది పాల్గొనడం ఒక విశేషమైతే స్థానిక భాగస్వామ్యం నలుగురు పాల్గొనటం మరొక విశేషం.
వేకువ సేవ అనంతరం కాఫీ సేవిస్తూ జట్లు జట్లుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా శాస్త్రి గారు కెమేరా క్లిక్ మనిపించడం ఒకెత్తయితే, అదే సమయంలో ఆకాశంలో వలయాకారంగా బయలు దేరిన పక్షుల సమూహం శాస్త్రి గారి కెమేరాకు చిక్కడం మరొక విశేషం.
శారద గారు పలికిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి రేపటి కార్యక్రమం కాసానగర్ సెంటర్ అని రూఢి చేసుకుని నేటికి స్వస్తి పలికారు స్వచ్ఛ కార్యకర్తలు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
28.05.2025.
కడియాల, సురేష్ గారి
స్వంత కుటుంబం బదులుగ స్వచ్ఛ కుటుంబంతోనె కలిసి
సంకురాత్రి వేడుకలను జరిపించుట - మురిపించుట
సంప్రదాయములతో బాటు స్వచ్ఛతనారాధించుట
కడియాల, సురేష్ గారి ఘనతకు చెందిన ముచ్చట!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
28.05.2025.