3636* వ రోజు . ....           29-Oct-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

29.10.2025 బుధవారం 3636* రోజు నాటి శ్రమ ఘట్టాలు!

                     మొంథాతుఫాను ప్రభావంతో చల్లపల్లి నాల్గు చెరగులా అన్ని రహదారుల వెంబడి ఉన్న చెట్లు అక్కడక్కడా గాలికి నేలకొరగడంతో స్వచ్ఛ కార్యకర్తలు గాలి ప్రభావం కొంత తగ్గిన తరువాత శ్రమయుద్ధంలోకి దిగారు.

పాగోలు రోడ్డులో, నడకుదురు రోడ్డులో, బాలికల హాస్టల్ రహదారిలో, పద్మావతి ఆసుపత్రి రహదారిలో ఇలా అనేక చోట్ల పడిపోయిన చెట్లను కార్యకర్తలు తొలగించే పనులు చేపట్టారు.

పాగోలు రోడ్డులో అనేక వృక్షాలు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం కలిగిన నేపధ్యంలో చల్లపల్లి పోలీస్ వారు, స్వచ్ఛ కార్యకర్తలు, మరికొంతమంది స్థానికులు పాల్గొని వాటిని తొలగించి ఇబ్బంది లేకుండా చేశారు.

పాగోలు రోడ్డులో జరిగిన స్వచ్ఛ సేవలో పాల్గొన్న CI ఈశ్వరరావు గారు “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదాన్ని పలికారు.

తదుపరి బాలికల హాస్టల్ ప్రాంగణంలో చెట్లను స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, పంచాయితీ సిబ్బంది, మనకోసం మనం ట్రస్టు సిబ్బంది, కొంతమంది స్థానికులు నిర్విరామంగా శ్రమించి తొలగించారు..

               రేపు మన స్వచ్ఛ కార్యక్రమానికి అందరూ బాలికల హాస్టల్ వద్ద కలుసుకుందాం.

- నందేటి శ్రీనివాస్

ప్రజా కళాకారుడు

29.10.2025.

రాష్ట్రమంతట నిండిపోవా? – 2

ఊరికొక డి.ఆర్.కె. ఉంటే - ఉపాధ్యాయులు తోడు వస్తే

స్త్రీలు సైతం కొంగుదోపి గ్రామసేవకు తరలి వస్తే

విశ్రాంతులూ ఉత్సాహ పడితే - వృత్తి నిపుణులు కలిసివస్తే

వ్యాప్తి చెందవ రాష్ట్రమంతా స్వచ్ఛ సుందర చల్లపల్లులు?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    29.10.2025