ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!
బందరు రోడ్డులో -3642* వ నాటి శ్రమదానం :
మంగళవారం (04.11.25) వేకువ 4:14 నుండీ నేటి శ్రమదానం మొదలై 2 గంటలకు పైగా జరిగి 6:20 కి ముగిసింది!
బందరు వీధిలో – SRYSP కాలేజి వద్ద నుండి కొత్తగా కడుతున్న “శ్రావ్య కృష్ణ” హాస్పిటల్ వద్ద వరకు నేడు శ్రమ జరిగింది.
నేటి కార్యక్రమంలో కార్యకర్తలు -
రోడ్ల ప్రక్కల పిచ్చి గడ్డిని,
పిచ్చి మొక్కల్ని,
గతంలో రోడ్ల ప్రక్కన పెంచి పోషించిన మొక్కల వద్ద కలుపును,
రోడ్ల మార్జిన్లల్లో పేరుకుపోయిన మట్టి దిబ్బలను,
పండ్ల దుకాణం ప్రక్కన పెద్ద చెత్త గుట్టను
తొలగించి శుభ్రం చేసి, చెత్తను డంపింగ్ కేంద్రానికి తరలించి, మట్టిని మొక్కలకు దన్నుగా పోశారు.
6:20 వరకు విసుగు చెందకుండా పని చేసిన కార్యకర్తలు మూడు సార్లు మ్రోగించిన విజిల్ మ్రోతకు పని ఆపి,
అమెరికా పర్యటనను ముగించి 6 నెలల తర్వాత వచ్చిన “నల్లూరి రామారావు” గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొని 39 మంది కార్యకర్తలతో “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదాలను పలికించి,
ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి 1,000/- విరాళాన్ని డాక్టరు గారు స్వీకరించి,
రేపు కలవవలసిన ప్రాంతం “చిన్నారి పిల్లల వైద్యశాల” వద్ద అనుకుని వెనుదిరిగారు.
- ప్రసాద్ వేల్పూరి
ఒక స్వచ్ఛ కార్యకర్త
04.11.2025
ఎవ్వరిది ఈ ఊరు?
“ఎవరు ఈ ఊరి యెడల ఇంత ఎక్కువగా తపించిరొ –
ఊరు గాని ఊరు కోసం ఎన్ని లక్షలు వ్యయించితిరో –
ప్రవాసులుగా ఉండి గ్రామము నమితముగ ప్రేమించుచుండిరొ
వారిదా ఈ ఊరు - ఇక్కడి వాళ్లదా?” అని అడుగుతున్నా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.11.2025