పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదులుకుందాం!
సోమవారం - 23.3.26 వ నాటి గ్రామ బాధ్యత!-@3781*
నేటి తమ సామాజిక కర్తవ్య పాలకులు 29 మంది, వారిలో ATM కేంద్రం వద్ద ఆగి, పనుల్లోకి దిగినది 8 మంది, 6.12 దాక (ముగ్గురు మాత్రం 6.18 దాక) శ్రమదానం విహరించినది సంత వీధి జంక్షన్ మొదలు బందరు రహదారిలోని పెట్రోలు బంకు దాక!
తమకు అందిన తమ ప్రాంత పారిశుద్ధ్య అవకాశం అందుకొనని వారు దుకాణాల యజమానులు, వ్యాపారులు, స్థానిక గృహస్తులూ!
నిన్నటి కార్యకర్తల బాధ్యతలు ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లినందున, ఇక్కడి క్రిక్కిరిసిన కూరల- పండ్ల - చిల్లర – కొబ్బరి బొండాల - దేవాలయాల - టిఫిన్ విక్రయ బండ్ల వల్ల నిన్న క్రొత్తగా పుట్టుకొచ్చిన నానా రకాల వ్యర్థాల్ని చూసిన కార్యకర్తలు మొన్న శుభ్రపడిన చోటుల్లోనూ పని చేయటానికి ఇష్టపడినందున,
నలుగురైదుగురు గ్రామ గ్రంధాలయ వీధి కాలుష్య నివారణకు పూనుకొన్నందున,
బహుశా ఇసుక బళ్ల నుండి జారిన ఇసుక + దుమ్ము వీధి మార్జిన్లలో పేరుకు పోతున్నందున,
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు మళ్లీ వీధుల్లోకి చేరినందున,..... ఈ పూట కార్యకర్తల విధులు క్రొత్తగా 50 గజాల బందరు మార్గానికే పరిమితమై పోయినవి !
6.00 కు పంచాయతి కార్మికులు మరో ప్రక్క నుండి తోడయ్యారు. కార్యకర్తలకు అంతకుముందు రుచికరమైన రాగి జావ అందినది.
వెంకటేశ్వరుని గుడి సాక్షిగా 6.20 కి జరిగిన సనూవేశం తూములూరి లక్ష్మణుని నినాదాలతో ప్రారంభమై,
రేపటి నుండి కార్యకర్తలు మరీ 4.00 కు కాక, 4.30 కు వచ్చి, 6.00 కు మ్రోగుతున్న తొలి విజిల్ను గౌరవించాలనీ, పనులు తదుపరి నాటికి వదిలేయాలనే శంకర శాస్త్రి గారి సూచన సూచనతోనూ,
రేపటి పనులకోసం అందరం ATM లవద్ద కలవాలనే నిర్ణయం ముగిసింది!
అది సుమా ఘన దానధర్మము – 9
భవిష్యద్దార్శనికులు కొందరు భాగ్యనగరం, అమెరికాల్లో
ఉండి కూడా స్వచ్ఛ సుందర ఉద్యమాన్నంచనా కడుతూ
తమ శ్రమార్జిత ధనం పంపుతు తృప్తిచెందుట కాంచలేదా?
అది సుమా ఘన దానధర్మము! అది గదా నిష్కామ కర్మము?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
23.03.2026