3871* వ రోజు....           22-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

నేటి 29 మంది శ్రమా పాగోలు బాట 100 గజాలకే పరిమితం - @3871*

               ఈ సోమవారం (22-6-26) ఒక విధంగా ప్రత్యేకమైనది! దీని విశేషాలేమంటే -

1) సోమవారమైనా కూడ అందరు సమయ - శక్తి ప్రదాతలు - అందులోనూ రోగుల్ని స్వస్తపరచవలసిన వైద్యులూ, సిబ్బందీ, పాఠశాలలకు హాజరు కావలసిన ఉపాధ్యాయులూ, వ్యాపారులూ, రైతులూ 4.19 నుండి 6.06 దాక ఆ రోడ్డు అందచందాలకు బాధ్యత వహించడం,

2) చందమామ అపార్ట్మెంట్ల పక్క డ్రైను పనులు అంబటీ, కోడూరూ ముక్కులు మూసి పనిచేస్తుండడం,

3) రావడం రావడమే ఉత్తరపు డ్రైన్ అంచుకు దిగిన మోతుకూరి వెంకటేశ్వరరావు కార్యకర్త 6.00 తర్వాత విజిల్ మ్రోగేదాకా గోనె సంచి నిండుగా కాగితపు, ప్లాస్టిక్ ముక్కలు ఏరుతూనే ఉండడం,

4) శ్రీనివాసరావనే బడి పంతులు గారు నిర్వికారంగా ఉభయ డ్రైన్లను శుభ్రపరచడం,

5) ఆకుల ప్రసాదు గారు రానందు వల్ల పెద్దగా వృక్ష సుందరీకరణ జరుగకపోవడం, మరరంపపు మ్రోతలు లేకుండానే పనులు సాగడం,

6) హైవే216-కాసానగర-చెక్ పోస్టు కూడలితో బాటు,

               మేకలడొంక జంక్షన్ తో బాటు, పడమటి బజారు భాగంతో బాటు, 6 వారాలకు పైగా పడితే పట్టింది గాని, 1½  కిలోమీటర్ల 2 రహదారులూ శుభ్రపడి అందరి మన్ననలూ పొందడం,

7) 6.20 సమయంలో నాలుగు నెలల క్రితం ట్రస్టు ఉద్యోగంలో చేరిన మునీశ్వరరావు నినాదాలు ప్రకటించి, చల్లపల్లి శ్రమదానోద్యమం గురించి చక్కగా వివరించడం,

8) అడపా వారు క్లుప్తంగానూ, ప్రభావవంతంగానూ సూక్తులు వినిపించడం,

9) DRK డాక్టరు గారు మాత్రం సుదీర్ఘంగా మాట్లాడి, ఉచిత సలహా దారుల వైఖరిని చెప్పడం,

10) “రేపటి శ్రమదానం ఎక్కడ” అనే సంగతి గురించి చర్చలు నడిచి, తుదకు విజయవాడ దారిలోని NTR పార్కు ఎదుట కలవాలని నిర్ణయించడం!

               ననుసరించలేరెందుకో

టన్నుల కొలదిగ వీధుల మన్ను ఎత్తినది ఎవ్వరొ?

ప్రతి వేకువ గోతాలతొ ప్లాస్టిక్ ఏరుట దేనికొ!

30+3 వేల మొక్కల పెంపక మెవరిదొ!

అట్టి స్వచ్ఛ కార్యకర్త ననుసరించలేరెందుకో!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   22.06.2026