పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
వేకువ భారీ వర్షంలో సైతం 40 మందా ? @3954*
ఎంత ఆదివార (13.9.26) మైతే మాత్రం గాలి వానను తలపించే- రోడ్లను జలమయం కావించే భారీ వర్షం అలా వెలసిందో లేదో- పని చేయవలసిన స్థలమంతా బురద – నీళ్లతో అననుకూలంగా ఉన్నా సరే - ఇందరు స్త్రీ-పురుష- వృద్ధ కార్య కర్తలు బందరు వీధి లోని మునసబు వీధి వద్దకు 4.19 నుండీ చేరుకోవడమేమిటి?
చినుకులు పడుతూనే ఉన్నా, పోటీలు పడి మరీ అలా పారిశుద్ధ్య చర్యలేమిటి? ఏ కొద్ది మందో ఇవి “బడాయి పనులు” అనుకొంటే వింతేమున్నది? 2-3 కిలో మీటర్ల దూరములో-పొరుగు పంచాయతీకి చెందిన చందమామ అపార్ట్మెంట్ల వద్దా, కర్మల భవనం వద్దా భారీ వృక్షాలు పడిపోయి, రోడ్డు రవాణాకు ఇబ్బందైతేనూ, గోడ పడిపోతేనూ అన్నీ వీళ్లకే పట్టాలా?
అమరావతి రాజ భవనం వెలుపల 2 ప్రక్కలా గడ్డి పెరిగి పోయిందనీ, అటు ప్రక్కన సజ్జా వారి వీధి చెత్తా చెదారంతో నిండి అందంగా కనిపించడం లేదనీ ఈ స్వచ్ఛ కార్యకర్తలకింత దిగులెందుకు?
ఇందులో ఆకుల దుర్గా ప్రసాదు బట్టలంత కాకున్నా - సగం మంది ఒడలూ, బట్టలూ బురద మట్టి తో తడిసిపోతే పట్టించు కోక వీధుల గడ్డి తొలగించామనీ, పిచ్చి మొక్కలు పీకేశామనీ సంతోషిస్తారెందుకు?
ముగ్గురు డాక్టర్లూ, సమాజంలో కొంత గుర్తింపులున్న పెద్దలకూ ఇలా వర్షంలో తడిసే బురద పనులవసరమా? రెస్క్యూ టీమ్ జట్టు యువకులూ, మధ్య వయస్కులూ సరేగాని- కాళ్లు సరిగా లేని, నడుముకు సర్జరీలు జరిగిన సదరు జట్టుకు కెప్టెన్ గా చెప్పబడే అంజయ్య గారికి బరువైన సిమెంటు బల్లలు మోసే రిస్కు ఎందుకో అడగండి!
ఈ ప్రశ్నలకేం గాని- ఈ వేకువ 4.19-6.06 ల మధ్య ఈ మొండి మనుషులో లేక పిచ్చిపీక్ కు చేరిన వాళ్లో గాని పూనుకోకపోతే-
-రోడ్ల ప్రయాణికులకు ఈమాత్రం సౌకర్యం కలిగేదా?
- ఈ కాస్తంత 3 రోడ్లు శుభ్ర - సుందరకరణ సాధ్యపడేదా?
నేటి శ్రమ విశేషమే మంటే: అస్వస్థత వలన నెలకుపైగా
అతి వాదులు- తీవ్ర వాదులు
“అతి వాదులు, తీవ్ర వాదు”లను మాటలు వింటిమి గద
ఆబాపతు కరుడు గట్టు స్వచ్చోద్యమ కారు లిరుగొ
అందుకే ఇది దీర్ఘకాల స్వచ్చోద్యమ చల్లపల్లి!
ఆదర్శ శ్రమ గ్రామము ఆంధ్ర దేశమంతటికీ!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
13.09.2026