పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
ఈ ఆదివారం(18-10-26) నాటి వీధి పనుల శ్రమానందం 3988* వది!
సదరు అనందవర్ధనులు 17+17+10+4= 48 మంది!(ఈ సంఖ్యా విభజన హాజరు సమయాన్ని బట్టి- అంటే 4:21, 4:30, ఆ తరువాత, మరియు 6:10 కి వచ్చిన అతిథి కార్యకర్తలను బట్టి చేయడమైనది!)
ఐతే- ఎవరెప్పుడు వచ్చారు అనేది కాక - ఎవరెంత చెమట పట్టించుకొనిరీ- ఒంటి నిండా దుమ్ము అంటించుకొనిరీ- తమ ఊరి పట్ల ఎంతెంత బాధ్యత వహించిరీ అనేవే ముఖ్యమనుకోండి!
వ్యక్తిగతంగా నాకు వస్తున్న ఇబ్బంది ఒకటున్నది-చల్లపల్లి జన బాహుళ్యం కోసం ప్రతి వేకువా జరుగుతున్న ఈ అపూర్వ సేవలో- బాధ్యతలో గాని- వాటిని బాగా వివరించలేకపోతున్నానేమో అనిపిస్తుంటది! ఉదాహరణకు ఈ 3988వ- 40 మందికి పైగా కష్టాన్నే తీసుకొంటే:
1)10 మంది బలశాలురైన కార్యకర్తలు ఇండియన్ ఆయిల్ నిలయం వద్ద లోతుగా కాంక్రీటు పోసి నిలబెట్టిన 3 పెద్ద ప్రకటనల ఫలకాలను పెకలించడాన్నీ, కాంక్రీటు దిమ్మెల్ని పలుగులూ, సుత్తిలూ, మలాటులతో వంతులేసుకొని బ్రద్దలు కొట్టి, బంకు యజమాని అనుమతితో మోసుకుపోయి, ట్రాక్టర్ లోకి సర్దిన దృశ్యాన్ని వర్ణించాలో- (ఆ సందర్భంలో అది పట్టుతప్పి, ట్రస్టు కార్మిక అధ్యక్షుడి నిన్న దెబ్బతగిలిన చేతికే తృటిలో ప్రమాదం తప్పిందని బృందావన్- లక్ష్మణాదులు చెప్పారు!)
2) బంకు మొదలు వడ్లమిల్లర్ల సంఘ భవనం దాక అటొక డజను మందీ- ఇటొక డజను మంది రోడ్డు దుమ్ము వదలగొట్టిన ఉదంతాన్ని ప్రస్తావించాలో-
3) అక్కడ నిల్పిన లెట్రిన్లు ఖాళీ చేసే ట్రక్కు నుండి కారిన దుర్గంధ జలం వద్ద పని చేసుకుపోతున్న కార్యకర్తల్ని గురించి వ్రాయాలో-
4) రోడ్డు మార్జిన్ ల గోతుల్ని చక్కదిద్దుతున్న వారి ప్రయత్నాన్ని ఎంతగా మెచ్చాలో-
5) ఎప్పటి లాగే – 6:05కు పని విరమణ విజిల్ మ్రోగినా మరొక 7-8 నిముషాలు తూర్పు డ్రైను వద్దా, లోడింగు కారణమునా పనిచేసిన 10 మందిని పేర్కొనాలో-
6) నేను హెచ్చరించినా మళ్లీ మళ్లీ వచ్చే పోయే వాహనాల పట్ల జాగ్రత్త వహిస్తూ చీపురుతో రోడ్డు పైన ఊడుస్తున్న నాదెళ్ల- రావి ఇందిర పట్టుదలను మోచ్చాలో...
తేల్చు కోలేక తికమక పడ్డాను!
(నాకైతే ఈ 6 పనులమీద 6 పద్యాలు వ్రాయాలనే ఉంది గాని – పాఠకుల మీద దయ తలచి
ఈ ఉదయం బంకు వద్ద బాహాటంగా జరిగిన సమావేశం వెంకటాపుర నివాసి రావి ఇందిర గారి నినాదాలతో మొదలయింది; అప్పటిదాక పడిన కష్టమేమైపోయిందో గాని - కార్యకర్తలు ఉచ్ఛ స్వరాలతో ప్రతినినాదాలిచ్చారు!
రేపటి శ్రమ చండ్ర వికాసకేంద్రం వద్ద నుండి జరుగునని నిర్ణయమయింది.
కాలు మీద కాలేసుక
“కాలు మీద కాలేసుక దర్జాగా బ్రతుక గలుగు
విశ్రాంతోద్యోగులింత వెర్రిగ రోడ్డెక్కి చెత్త
పనులకు దిగుతున్నా”రని - ప్రశంసార్హ మీ కృషి” అని
పనిగట్టుక పొగడమా? తెగడుట? కింకర్తవ్యమ్?
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
18.10.2026