2034* వ రోజు....           06-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2034* వ నాటి శ్రమదాన విశేషాలు.

          ఈరోజు ఉదయం 4.01 – 6.00 మధ్య 32 మంది కార్యకర్తలు మూడు రోడ్ల సెంటరు నుండి నాగాయలంక రోడ్డు లోని పెట్రోలు బంకు మీదుగా  పడమటి వీధి లోని కోట గుమ్మం వరకు రోడ్డు మీద ఉన్న దుమ్మును, ఇరువైపులా ఉన్న చెత్తను శుభ్రం చేసి ట్రాక్టర్ లో లోడు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించారు.

 

- కొంత మంది కార్యకర్తలు పెట్రోలు బంకు ఎదురుగా ఉన్న రహదారి వనాన్ని శుభ్రపరిచారు.

 

- నాగాయలంక రోడ్డు లోని పెట్రోలు బంకు ఎదురుగా పండ్ల దుకాణ  దారుడైన పెదప్రోలు వాస్తవ్యుడు కొండూరి శ్రీనివాసరావు గారు స్వచ్చ కార్యకర్తలను అభినందించి కార్యకర్తలకు మామిడి పండ్లను అందచేశారు. వారికి కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

 

          స్వచ్చ కార్యకర్త ఆకుల దుర్గా ప్రసాద్ గారు చెప్పిన నినాదాలాతో నేటి కార్యక్రమం ముగిసింది.

 

రేపటి మన కార్యక్రమం కోసం వేకువ 4.00 కు బైపాస్ రోడ్డు లోని బాలికల హాస్టల్ వద్ద కలుసుకొందాం!

 

- దాసరి రామకృష్ణ ప్రసాదు

మేనజింగ్ ట్రస్టీ - మనకోసం మనం

శనివారం – 06/06/2020,

చల్లపల్లి.

 

4.07 కు సెంటర్లో
మామిడి పండ్లను ఇస్తున్న కొండూరి శ్రీనివాస రావు గారు
సెంటరు నుండి బస్టాండ్ వెళ్లే రోడ్డు