ప్రాతూరి శాస్త్రి 20.08.2020. ....           20-Aug-2020

 స్వచ్ఛ చల్లపల్లి

              732 వ రోజు

        స్వచ్ఛ సుందర చల్లపల్లి లో మరో మైలురాయి 732 వ రోజు.

              ఎన్నో మలుపులు. మరెన్నో అందాలు. స్వచ్ఛ చల్లపల్లి, స్వచ్ఛ సుందర చల్లపల్లి గా మారిన వేళ.

             డా. డి ఆర్ కె ప్రసాదుగారు, డా.పద్మావతి గార్లు బుద్ధప్రసాద్ గారితో సమాలోచన చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు గారిని చల్లపల్లి సందర్శనకు తీసికొనివస్తే మన ఊరి సమస్యలు కొన్నైనా తీరతాయనుకొన్నారు.

               నిరంతర నిస్వార్థ సేవకు అంకితమై  త్యాగభావాలకు ప్రతిరూపంగా శ్రమజీవనము గడుపుతున్న వారి కలలు తప్పకుండా సాకారమౌతాయి.

స్వచ్చ చల్లపల్లి 2 వ వార్షికోత్సవం రోజున కార్యకర్తలు అందరూ నాగాయలంక రోడ్డులో కమలాల వద్ద సమావేశమైనారు.

ర్యాలీ నాగాయలంక రోడ్డు నుండి బస్టాండ్ , డంపింగ్ యార్డు, అచట photo exhibition చూసి చాలా impress ఐనారు.

యార్డు నుండి ఆసుపత్రి రోడ్డులో underground drainage, పైన garden ప్రారంభించారు.

 అచ్చట నుండి SRYSP College లో సభకు విచ్చేసారు.

ఆరోజుల్లోనే ప్రభుత్వం వారు స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి డా.సీ యల్ వెంకటరావు గారిని వైస్ చైర్మన్ గా నియమించింది.

   ప్రభుత్వ అధికారులు చాలామంది వచ్చారు. మన డాక్టర్ గారు చల్లపల్లి కి భూగర్భ డ్రైనేజీ కావాలనీ, మరి కొన్నివేయాల్సిన రోడ్లు గురించి తెలిపారు.

  అయ్యన్నపాత్రుడు గారు గ్రామంలో సందర్శించిన ప్రాంతాలలో ఒక చిన్న కాగితం కూడా చూడలేదన్నారు.

 రాష్ట్రంలో 13000 గ్రామలున్నాయని చల్లపల్లి సందర్శన చేయమని ప్రోత్సాహామిస్తామన్నారు.

 చల్లపల్లి లో సేవాకార్యక్రమాలకు ఒక పాఠశాల పెట్టించాలని , ప్రభుత్వం నుండి చేతనైన సాయం చేస్తామన్నారు.

  సీ యల్ వెంకట్రావు గారు స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ కి పీఎస్ గా విద్యాసాగర్ గారిని నియమించారు.

 మంత్రిగారు డాక్టర్ గారడిగినవి  ప్రభుత్వం ద్వారా చేయిస్తామన్నారు.

కాలతీతమైనా ఆరోజు ఆనందంగా గడిచింది.

                బిళ్ళగన్నేరులు

కళ్లేపల్లి రోడ్డులో మేకలడొంక వద్ద శుభ్రం చేస్తున్నప్పుడు జంతువులు తినని మొక్కలు ఏవి అని అలోచించగా బిళ్ళగన్నేరు అని తెలిసి  ప్రతిరోజూ వేకువ 4.30 కు నేనూ, బృందావన్, నేనూ గోపాలకృష్ణయ్యగారు, సూపర్ వైజర్ శ్రీను గారు  గ్రామంలో వెతికి తెచ్చేవాళ్ళం. మేకలడొంక దగ్గర బిళ్ళగన్నేరు మొక్కలు బాగా పెరిగాయి.

 

వేముల శ్రీనివాస్, వివేకానంద డిగ్రీకాలేజీ  లో లెక్చరర్ గారు వాకింగ్ కి వచ్చి మొక్కలకు కాలువలోని నీరు పోసేవారు. కొన్నాళ్ళకు వారుగూడా కార్యకర్తలు అయ్యారు.

 అలా బిళ్ళగన్నేరులు చల్లపల్లి గ్రామంలో అన్ని రోడ్ల ముందు మొక్కలు చాలా అందంగా చూపరులనాకర్షించాయి.

డంపింగ్ యార్డులో బిళ్ళగన్నేరులు నాటాక గ్రామంలో వెతకవలసిన అవసరం పోయింది. కొన్ని వందల మొక్కలు జనించాయి.

  బిళ్ళగన్నేరుల అందాలు చూసిన జనం వారి ఇళ్లముందు గూడాపెంచడం మొదలెట్టారు.                 

         800 నుండి 900 రోజులు

Try to serve truly, All power come through true service.

Service wipes out all egotism. అన్నారో కవి.

        ఇన్నిరోజుల సేవా కార్యక్రమాల ద్వారా , గ్రామంలో జరుగుతున్న మార్పులు, చేస్తున్న పారిశుధ్య కార్యక్రమాలు చూస్తున్న గ్రామ ప్రజలలో మార్పు వచ్చింది.      

              నారాయణరావు నగరిలో సేవాకార్యక్రమాలు.

గోవాడ చంటి గారు ఉత్తేజితులై నారాయణరావు నగరులో ప్రతిరోజు ఓ గంట తమ కార్యకర్తలతో సేవ చేస్తామన్నారు.

నారాయణరావు నగరులో తాపీ మేస్త్రీలు, మెకానిక్ లు, ప్లంబర్లు, ఉదయం 8 గం కు వారివారి పనులకు వెళ్ళిపోతారు.

అందుచే ఉదయం 6గం నుండి 7 గం వరకు స్వచ్ఛ సేవ చేయ ప్రారంభించారు.

6 వ నం కాలువ నుండి నాలుగు రోడ్ల సెంటర్, గురుకుల పాఠశాల, విజయవాడ రోడ్డు వైపు అలా కాలువ ఎగువ భాగం 3 నెలల పాటు చేశారు.

కనీసం ఒకరి నొకరు అభివాదం చేయడం కూడా తెలీదు వారికి. మర్యాదగా మాట్లాడడం తెలీదు వారి వృత్తులవల్ల. తరువాతి రోజులలో అభివాదం చేయడం నేర్చుకొన్నారు.

ఉదయం స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలు అవగానే నేను, గోపాలక్రిష్ణయ్యగారు, బృందావన్ గానీ సుబానీ గానీ వెళ్ళేవారం. వారికి కొన్ని సలహాలు ఇవ్వడం సభ్యతా పలుకులు, సేవామధుర్యం కలగజేయడం చేసేవాళ్ళము.

రోజూ 20 మంది సేవకు వచ్చేవారు.

ఈరోజుకీ వీరు కనబడితే నమస్కారం చెప్పడం మానరు.

               డా.డీఆర్కే గారు అన్నట్లు

"సంస్కారవంతమైన నమస్కారం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఇస్తాయి" అని.

 నారాయణరావు నగర్ గూడా శుభ్రపడింది. వారందరు చెత్తబండి వస్తే మా నారాయణరావు నగర్ ఇంకా శుభ్రపడుతుందని స్థానికులు చెప్పారు.

                 కొన్నాళ్ళకి వారి కోరిక సఫలమైంది.                      

                చల్లపల్లిలో జనచైతన్య యాత్రలు.........

ఉదయం కార్యక్రమాలైన తర్వాత సమావేశాల్లో  ఓ నిర్ణయం తీసుకొన్నారు.

 కార్యకర్తలు పెరిగారు. దాదాపు రోజు 60 నుండి 70 మంది రాసాగారు.

ఇంతమంది సలహాలిస్తే, ఏది ఆచరించాలి ఏది తరువాత అన్న ప్రశ్న వస్తుంది.

మా సజ్జా ప్రసాదుగారు ఎవరు సలహా ఇస్తే వారు ముందు పాటించాలి అని. ఆమోదయోగ్యమే గదా.

  ప్రభుత్వం చేసే చైతన్య యాత్రల వలె చల్లపల్లి లో గూడా చల్లపల్లి లో జరపాలని నిర్ణయించారు.

1. ఇంటివద్ద చెత్త రోడ్డుపై వేయరాదు

2. కారీ బ్యాగులు వాడ రాదు

3.  ఇంటి పరిసరాల శుభ్రత

 ఇలా ఓ కరపత్రము తయారుచేసి ప్రతి ఇంటికి ఇచ్చి, వివరాలు విశేదపరచడం

 ఇంటికో సంచి ఇచ్చి బజారు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గుడ్డ సంచి వాడాలని తెలియపరచడం.

 గ్రామంలో 5,000 కుటుంబాలున్నాయి. అంటే 5000 సంచులు కావాలి.

సజ్జాప్రసాదుగారు సంచులు సలహాఇచ్చి 5000 సంచులు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు.

 డా.పద్మావతి గారి సలహా మేరకు కాలేజీ విద్యార్థులను గూడా బాగాస్వామ్యం  చేయించారు.

ప్రతిరోజు సాయంత్రం 4 గం నుండి 6 గం వరకు వార్డుల వారీగా ఇండ్లలోని వారిని చైతన్య పరిచారు.

మొదటి రోజు విద్యార్థుల ర్యాలీ తో బయలుదేరి డాక్టరుగారితో, గ్రామాధికారులు, కార్యకర్తలు, విద్యార్థులతో పాదయాత్ర చేసి కీర్తి ఆసుపత్రి నుండి బయలుదేరి 1 వార్డు లో తిరిగి అందజేశారు.

ఇది ఒక మహత్తర కార్యక్రమము.

గ్రామంలో కార్యకర్తలకు మంచి గుర్తింపు వచ్చింది.

నారాయణరావు నగర్, గౌడ బజారు, తోటలలోని వారు మేం వెళ్ళేటప్పటికె స్వచ్ఛభారత్ వారు వస్తున్నారు అని ఇండ్ల ముందు శుభ్రం చేసి ఉంచేవారు.

  గ్రామ ప్రజలందరు మన సేవాకార్యక్రమాలలో పాల్గొనవసరం లేకపోయినా వారి వారి ఇండ్లముందు పరిశుభ్రం చేసుకొంటే  పాల్గొన్నట్లేకదా అని అనుకొనేవారు.   

ఈ రోజుల్లోనే తెనాలి municipal commissioner చల్లపల్లి చూడడానికి వచ్చారు.

తెనాలి వారు గూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టి పట్టణం అంతా పరిశుభ్రతకు మారుపేరుగా తీర్చి దిద్దారు.

 కానీ చల్లపల్లి కి వచ్చిన పేరు ఎవరికీ రాలేదు.

  కారణం

డాక్టర్ దంపతులు నిర్వహిస్తున్న  పారిశుధ్య వ్యవస్థ.

గ్రామంలోని పారిశుధ్య కార్యక్రమాలతో పాటు గ్రామ శివార్లలో తోటమాలులను నియమించి రోడ్లపై మలవిసర్జన జరగకుండాను, నాటిన మొక్కల సంరక్షణ చేసేటట్లు చూడడం.

డాక్టర్ పద్మావతి గారు నెలనెలా పారిశుధ్య కార్మికులతో మాట్లాడడం, వారి కష్టసుఖాలు విచారించడం చేసేవారు.

ప్రతి సంవత్సరం పారిశుధ్య కార్మికులకు యూనిఫామ్ ఇవ్వడం.

వారి బాగోగులు చూసేవారు.

ఇటు పంచాయితీ వారిని, అటు కార్మికులను సమన్వయపరచేవారు.

ప్రాతూరి శాస్త్రి 

20.08.2020.