ప్రాతూరి శాస్త్రి - 30.10.2020. ....           30-Oct-2020

 "ధీరులు తమ కర్తవ్య సాధన కోసం మనసును చెదరనీక స్థిరంగా ఉంచి అసాధ్యాలను సుసాధ్యం చేయగలరు":

సుందర చల్లపల్లి హారానికి మణిపూసలు.

దాసరి రామమోహనారావు గారు, దాసరి స్వర్ణలత గారు :

డా. డీఆర్కే ప్రసాదు గారి మాతాపితలు.

యెనుబది యేండ్లు పైబడినా వారికి మొక్కలంటే ప్రాణం.

స్వచ్ఛ చల్లపల్లిలో నాటిన మొక్కల సంరక్షణ చూస్తూవుంటారు.

ఏ సమయంలో ఎరువు వేయాలో, ఏయే మొక్కలు నాటాలో తెలుయజేస్తుంటారు.

ఆసుపత్రిలో ఓ నర్సరీ ఏర్పాటుజేసి ఆసుపత్రి కార్మికులతో పని చేయిస్తూ వుంటారు.

ప్రతి సంవత్సరం వారి జన్మదినాన మనకోసం మనం ట్రస్టుకి విరాళం ఇస్తారు.

2017 ఫిబ్రవరి 4 న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలకు అనుగుణంగా ఉండేందుకు EECO వాన్ ను విరాళంగా ఇచ్చారు.

డాక్టర్ గారి మాతృశ్రీ. స్వచ్ఛ చల్లపల్లి మామ్మగా విఖ్యాతి.

జరిగే కార్యక్రమాలను గురించి వినుట.

కార్యకర్తలకు, రధసారధులకు, ఆసుపత్రి సిబ్బందికి పెద్దదిక్కుగా వుంటూ అందరి మన్ననలు పొందుతున్న నారీమణి.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ని ప్రత్యక్షంగాను, పరోక్షంగా కూడా పరిరక్షించే మహనీయులు.

 

దాసరి వెంకట రమణ :

"A man of greatness"               

ఉద్యమం సజావుగా సాగాలంటే కార్యకర్తలతో పాటు ఎంతో మంది సహకారం అవసరం.

వీరు చిన్నాజీగా సుపరిచితులు.

Talk less work more అన్న సామెత చక్కగా వర్తిస్తుంది. స్వచ్ఛ సుందర చల్లపల్లి మూలస్థంభాలలో ప్రముఖపాత్ర వీరిది.

ఎక్కడ పేవరు టైల్స్ వేయించినా, డంపింగ్ యార్డులో చెత్త నుండి సంపద కేంద్ర నిర్మాణం, మహాప్రస్థానం నిర్మించినా భౌతికంగా నిర్మాణానికి అవసరమైన పనులు చేయించేవారు.

Planner’s తో సమావేశాలు, contractor లతో మాట్లాడి పనిచేయిస్తారు.

ఒకరకంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కి external affairs అన్నీ చూస్తారు.

He is a disciplined soldier who thinks always about Swachha Sundara Challapalli.

A brave woman Sneha disciplined man Kumar :

తల్లిదండ్రులకు తగిన తనయ.

ప్రతి సంవత్సరం సెలవులిచ్చినపుడు దుబాయ్ నుండి మాతృభూమి చల్లపల్లి కి విచ్చేస్తుంది.

చల్లపల్లి లో ఉన్న రోజులు స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలలో పాల్గొని ఆనందం పొందుతారు.

ఆమె భర్త నాగేంద్ర కుమార్ కూడా చల్లపల్లి లోవున్న రోజులన్నీ స్వచ్ఛ కార్యకర్తలతో కలసి సేవ చేస్తుంటారు.

కుమార్ గారు ఓ ఆర్టిస్ట్. సంతబజారు, రైతుబజారులు నవీకరించి రంగులు వేసినప్పుడు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.

మనకోసం మనం ట్రస్టు సభ్యులుగా స్నేహ వ్యవహరిస్తున్నారు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి నిర్మాణార్ధం ఎంతో గొప్పగా ప్రతి సంవత్సరం విరాళం ఇస్తూనే వుంటారు.

వీరి పుత్రిక శృతి ఓ బాలకార్యకర్త. కుటుంబమంతా స్వచ్ఛ సుందర చల్లపల్లి బంధువులే.

 

డా. వరుణ్, డా.దివ్య :

నాగార్జున హాస్పిటల్స్, విజయవాడ             

డా. పద్మావతి, డా.డీ. ఆర్కే. ప్రసాదు గార్ల కుమారుడు, కోడలు

వీరు ఎప్పుడు చల్లపల్లి వచ్చిన స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొంటారు. అంతే కాదు వీరు మనకోసం మనం ట్రస్టు సభ్యులు.

వీరి పుత్రరత్నాలు ఆర్య, ఆరవ్ లు నాలుగేళ్ళ వయసునుండే బాల కార్యకర్తలుగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కి సుపరిచితం.

వీరువురు నినాదాలు ఎంతో అందంగా చెప్తారు.

వీటికోసం చిన్న గొర్రులు, చిన్న చీపుళ్ళు తయారు కాబడ్డాయి.

 

లక్ష్మీరాణి, ప్రసాదు గార్లు :

లక్ష్మీరాణి గారు State Bank Of India లో ఆఫీసర్ గా విజయవాడలో పనిచేస్తున్నారు. వీరు డా. డీఆర్కేప్రసాదు గారి సోదరి, బావగార్లు.

వీరికి స్వచ్ఛ సుందర చల్లపల్లి అంటే చాలా మక్కువ.

చల్లపల్లి వచ్చినపుడు కార్యక్రమంలో పాల్గొంటారు.

- ప్రాతూరి శాస్త్రి

30.10.2020.