ప్రాతూరి శాస్త్రి - 31.10.2020. ....           31-Oct-2020

 మనిషి తలచుకుంటే మహాద్భుతాలు చేస్తాడు, అంటారు డా.డీఆర్కేప్రసాదు గారు.

"పద్మావతి ఆసుపత్రి సిబ్బంది"

Selfless service is like rays of the sun.

That serve the world by shining alike on all creations.

అన్నారో కవి గారు

కార్యోత్సాహము కార్యకర్తకు

జనుల పెంపుజూసి రధసారధులకున్

పొగడ్తల నుబ్బరు ఏనాడైనా

సద్విమర్శలకు స్పందింతురు ఎక్కడైనన్.

పలికినారు మరొకరు.

క్షమ కవచంబు క్రోధమది శత్రువు అన్నారు భర్తృహరి.

చిన్ననాటి నుండి చదివినవే. కానీ ఆచరణ కొంతమంది కే సాధ్యం.

అదే పద్మావతి ఆసుపత్రి సిబ్బంది లక్షణం.

2013 డిసెంబర్ నుండి డాక్టర్ గారితో పాటు ఆసుపత్రి బజారులో బహిరంగ మలవిసర్జన ఆపడానికి వేకువ నర్సులు, కాంపౌండర్లు పాల్గొనేవారు. సాధారణంగా నైట్ డ్యూటీ చేసేవారు వస్తుంటారు.

దాదాపు నర్సులందరు స్వచ్ఛత సేవలో పాల్గొంటూనేవున్నారు.

కొంతమంది కాంపౌండర్లు కత్తులతోను, చెత్త లోడింగ్లోనూ సేవలందిస్తున్నారు.

Lab లోను, Medical shop లోను పనిచేయు సిబ్బంది శని, ఆదివారాల్లో స్వచ్ఛ చల్లపల్లి లో సేవజేయ వస్తారు. వీరంతా ప్రత్యక్షంగా కనబడతారు.

పరోక్ష సేవకులు

కార్యకర్తలు వాడిన గ్లోవ్స్, షూలు, కాఫీ కప్పులు కడగడం సాధారణంగా ఆసుపత్రి ఆయాలు చేస్తుంటారు.

మరొక ముఖ్యమైన వ్యక్తి వేల్పూరి ప్రసాదు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాల వివరాలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం. కార్యకర్తలు చేసే పనుల వీడియోలు తయారుచేసి Pendrive లలో నింపి డాక్టర్ గారికి అందజేస్తుంటారు.

స్వచ్ఛ చల్లపల్లి ఫోటోలు, వీడియోలు  కార్యకర్తల వివరాలు Laptop లో నిక్షిప్తం చేసి పత్రికల వారికి, Facebook, Whatsapp, Website లలోను పోస్ట్ చేస్తారు.

పర్యాటకులు వచ్చినపుడు Power Point Presentation కి సహకరిస్తారు.

ప్రసాదుతో పాటు షర్మిల గూడా ఈ సేవలందిస్తారు.

వేకువ 3.15 ని కే వచ్చి బృందావన్ కావలసిన పనిముట్లు, నీరు, గ్లోవ్స్, మాస్కులు తోనూ, సూపర్ వైసర్ శ్రీను ట్రాక్టర్ డ్రైవర్ ఆనందరావుతోను బయలుదేరతారు.

డా.పద్మావతి గారు, డా.డీఆర్కే ప్రసాదు గారు కారులో వేకువ 3.50ని కే చేయవలసిన చోటుకి చేరి వచ్చిన కార్యకర్తలను ఓ ఫోటోలో బంధించి వాట్సాప్ లో పోస్ట్ చేస్తారు.

డా.పద్మావతి గారు మంచినీరు తాగే సమయం తప్ప మిగిలిన సమయమంతా సేవాకార్యక్రమంలోనే వుంటారు.

తన సుందరీకరణ బృందంతో ఓ నిర్ణీత ప్రాంతం తీసికొని పరిశుభ్రం చేస్తుంటారు. వారు శుభ్రం చేసినచోట గడ్డిపరక మరల మొలవడానికి భయపడుతుంది.

నర్సులు, కాంపౌండర్లు వారివారి పనులలో మునిగివుంటారు. తలకు దీపాలున్నా లేకపోయినా పనిచేస్తూనే వుంటారు.

నల్లూరి రామారావు గారి మాటలలో బృందావన్ ఒక ఆల్ రౌండర్. అందరికీ చేయూతనిస్తూ, తనపని తాను చేసికొంటూ, రక్షకదళము లీడర్ గా సేవలందిస్తాడు. 200 వ రోజు నుండి స్వచ్ఛ చల్లపల్లి కి సేవలందిస్తున్నాడు.

రిసెప్షనిస్ట్ లక్ష్మీ అంటే తెలియని వారు లేరు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలకు తొలుత అడుగిడక పోయిన డా.పద్మావతి గారి (మా అమ్మ) ప్రోద్భలంతో 45 వ రోజునుండి పాల్గొంటూ సేవలందిస్తున్నది.

ఏ సమావేశాలు జరిగినా, టిఫిన్లు ఏర్పాటుచేసినా, పర్యాటకులు వచ్చిన వారందరికీ కావలసిన భోజన వసతి సదుపాయాలు సమకూర్చడంలో ప్రముఖ పాత్ర వహించి, బృందావన్ సహాయ సహకారాలు అందించగా వచ్చిన వారిని సంతోషంతో ఆదరించుతారు.

ప్రత్యక్షంగా లక్ష్మీ వారానికి రెండు రోజులు సేవజేసినా, బృందావన్ రోజూ సేవకు వచ్చినా, పరోక్షంగా ప్రసాదు  సేవజేసినా, ‘మనకోసం మనం ట్రస్టు అకౌంట్స్ శారద, రోహిణి చూసినా, కార్యకర్తలు రెండు గంటలు సేవజేస్తే, వీరు అవసరాన్ని బట్టి దినమంతా పనిజేస్తారు..

మన కోసం మనం ట్రస్ట్ కార్మికులు :

చల్లపల్లి గ్రామంలో అన్ని రహదారులలో తోటమాలుల నియామకం జరిగింది.

వీరు వారికి నిర్దేశించిన రహదారులలో గల మొక్కల సంరక్షణ, బహిరంగ మలవిసర్జన జరుగకుండా చూస్తారు. కార్యకర్తలే కాక ఉద్యమాన్ని కాపాడేవారు మరికొందరు. నాటిన మొక్కల పరిరక్షణకు గ్రామ నలుదిశలా శ్రమిస్తున్న ట్రస్ట్ ఉద్యోగులు, వేకువసేవ పూర్తికాగానే కంపకట్టుటకు, ఎరువువేసేవారు, మొక్కలకు నీరు అందించే ట్రస్ట్ కార్మికులు, ఉద్యమ ప్రారంభం నుండి ఈనాటి వరకు సంబంధం ఉన్నా లేకపోయినా తమవంతు సేవ చేస్తూ తెరవెనుకే ఉండి ఉద్యమ స్ఫూర్తి కలిగిస్తున్న పద్మావతి ఆసుపత్రి సిబ్బంది చిరస్మరణీయులు.

Selfless service consists in rendering services to develop the villages with no thought of gain, reward or result.

Men may come and go, but we go on forever. ఇది మరొకరి భావన

ఏమైతేనేం అందరం గ్రామాభ్యుదయానికి తోడ్పడుదాం.

జై స్వచ్చ సుందర చల్లపల్లి

- ప్రాతూరి శాస్త్రి

31.10.2020.